రావు గోపాలరావు అంత్యక్రియల సమయంలో స్టార్ హీరోలు అలా చేశారా?

తెలుగు సినిమాలలో విలక్షణమైన పాత్రలు చేయడం ద్వారా రావు గోపాలరావు నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ముత్యాల ముగ్గు సినిమాలోని పాత్ర ద్వారా రావు గోపాలరావుకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.తనదైన డైలాగ్ మాడ్యులేషన్ తో రావు గోపాలరావు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.1937 సంవత్సరంలో కాకినాడలోని గంగనపల్లి అనే గ్రామంలో రావు గోపాలరావు జన్మించారు.

 Interesting Facts Aboutactor Rao Gopal Rao, 125 Movies, Interesting Facts, Rao G-TeluguStop.com

చిన్నప్పటి నుంచే నాటకాలపై విపరీతమైన ఆసక్తి ఉన్న రావు గోపాలరావు ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను సంపాదించుకున్నారు.కొన్ని సినిమాల్లో రావు గోపాలరావు కామెడీని కూడా పండించటం గమనార్హం.

దాదాపు ఆరు సంవత్సరాల పాటు రావు గోపాలరావు పార్లమెంట్ సభ్యునిగా కొనసాగారు.రియల్ లైఫ్ లో సౌమ్యుడు అయిన రావు గోపాలరావు తెరపై మాత్రం విలన్ రోల్స్ లో ఎక్కువగా నటించారు.

రావు గోపాలరావు తనయుడు రావు రమేష్ సైతం ప్రస్తుతం వరుసగా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

Telugu Kidney Problem, Madras, Rao Gopal Rao, Actors, Tollywood-Movie

తన సినీ కెరీర్ లో 125కు పైగా సినిమాలలో రావు గోపాలరావు నటించారు.మధుమేహం తీవ్రమై కిడ్నీలు చెడిపోవటం వల్ల రావు గోపాలరావు చనిపోయారు.రావు గోపాలరావు అంత్యక్రియలకు అప్పటి సినీ ప్రముఖులలో ఎక్కువ మంది హాజరు కాలేదు.

Telugu Kidney Problem, Madras, Rao Gopal Rao, Actors, Tollywood-Movie

రావు గోపాలరావు అంత్యక్రియల సమయంలో అప్పటి స్టార్ హీరోలతో పాటు తోటి నటులలో ఎక్కువమంది హాజరు కాకపోవడం గమనార్హం.చిన్నస్థాయి కార్మికులు మాత్రమే సినీ రంగం నుంచి ఆయన అంత్యక్రియల్లో ఎక్కువగా పాల్గొన్నారు.మద్రాస్ లో రావు గోపాలరావు అంత్యక్రియలు జరిగాయి.రావు గోపాలరావు అంత్యక్రియల సమయంలో కొంతమంది తమిళ మిత్రులు మానవత్వం ఉన్న గొప్ప మనిషి అయిన రావు గోపాలరావుకు ఆ విధంగా అంత్యక్రియలు జరగడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube