సీనియర్ ఎన్టీఆర్ సక్సెస్ కు కారణమైన వ్యక్తి ఎవరో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే?

సీనియర్ ఎన్టీఆర్ తన సినిమాల ద్వారా, రాజకీయాల ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.అడవి రాముడు, యమగోల, లవకుశ, మాయా బజార్ మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

 Interesting Facts About Senior Ntr Career Success Details Here , Carerer Success-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమరావు అన్నాదమ్ముళ్లు అయినా వీళ్లిద్దరూ రామలక్ష్మణులలా ఉండేవారని చాలామంది చెబుతారు.

రామారావు త్రివిక్రమరావు మధ్య వయస్సుపరంగా మూడేళ్లు వ్యత్యాసం కాగా తమ్ముడు అంటే సీనియర్ ఎన్టీఆర్ కు ఎంతో అభిమానం ఉండేది.

త్రివిక్రమరావుకు కూడా సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమ ఉండేది.ఒకరు ఏదైనా విషయాన్ని ఆలోచిస్తే మరొకరు ఆ విషయాన్ని ఆచరణలో ఆచరణలో పెట్టేవారు.వాళ్లిద్దరి మధ్య అంతలా అనుబంధం ఉండేది.సీనియర్ ఎన్టీఆర్ బీఏ వరకు చదవగా త్రివిక్రమరావు మాత్రం చదువుకోలేదు.

సీనియర్ ఎన్టీఆర్ కు సినిమాలలో అవకాశాలు వచ్చిన సమయంలో సినిమాల్లోకి వెళ్లాలా వద్దా అని ఆయన కన్ఫ్యూజ్ అవుతుండగా త్రివిక్రమరావు సీనియర్ ఎన్టీఆర్ ను ప్రోత్సహించారు.సీనియర్ ఎన్టీఆర్ కు కెరీర్ తొలినాళ్లలో అవకాశాలు రాలేదు.

అయితే ఆ సమయంలో నైతికంగా బలం ఇచ్చి త్రివిక్రమరావు ఆయనను ప్రోత్సహించారు.ఆస్తిలో తన వాటాను కూడా తమ్ముడికి రాసిచ్చి తమ్ముడి పెళ్లికి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎన్టీఆర్ చూసుకున్నారు.

Telugu Career, Lava Kusha, Mayabazar, Senior Ntr, Trivikramaravu-Movie

సీనియర్ ఎన్టీఆర్ తన కుటుంబానికి ఎంత మొత్తం ఖర్చు చేసేవారో తన తమ్ముడి కుటుంబానికి సైతం అదే స్థాయిలో ఖర్చు చేసేవారు.సీనియర్ ఎన్టీఆర్ 1996లో కన్నుమూయగా త్రివిక్రమరావు 1998 సంవత్సరంలో కన్నుమూశారు.సీనియర్ ఎన్టీఆర్ కష్టజీవి అని కష్టాల్లో ఉన్న ఎంతోమందికి ఆయన సహాయం చేశారని ఎంతోమంది సినీ ప్రముఖులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎవరికీ తెలియని విషయాలను వెల్లడించారు.ఎంతోమంది నటుల ఎదుగుదల కోసం ఆయన కృషి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube