ఇంతమంది స్టార్స్ ఉన్నా బన్నీ నంబర్ 1 స్థానంలో నిలవడానికి కారణాలివే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే.పుష్ప ది రైజ్ సినిమాతో ఇతర భాషల ప్రేక్షకులకు దగ్గరైన బన్నీ పుష్ప ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ ను రూల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.2021 సంవత్సరంలో ఎక్కువగా సెర్చ్ చేసిన ఆసియా సెలబ్రిటీ జాబితాలో సౌత్ నటులలో తొలి స్థానంలో బన్నీ ఉన్నారు.

 Interesting Facts About Bunny Number One Place Details Here , Bunny, Inaterestin-TeluguStop.com

అయితే బన్నీకి ఈ గుర్తింపు దక్కడానికి పుష్ప దినిమానే కారణమని తెలుస్తోంది.

పుష్ప ట్రైలర్ లో బన్నీ చెప్పిన తగ్గేదేలే డైలాగ్ ఊహించని స్థాయిలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.ఈ డైలాగ్ వల్ల బాలీవుడ్ లో బన్నీ గురించి జోరుగా చర్చ జరిగింది.

పుష్ప సినిమా కోసం బన్నీ పడిన కష్టం అంతాఇంతా కాదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సినిమాల్లో డీగ్లామర్ రోల్స్ లో నటించడానికి ఇష్టపడరు.

అయితే బన్నీ మాత్రం ఈ విషయంలో భిన్నమనే సంగతి తెలిసిందే.పాత్ర కోసం తన లుక్ ను మార్చుకోవడానికి వెనుకడుగు వేయని హీరోగా బన్నీకి పేరుంది.పుష్ప ది రైజ్ గురించి రిలీజ్ తర్వాత జోరుగా చర్చ జరగడం కూడా బన్నీకి ఈ స్థాయిలో గుర్తింపు దక్కడానికి కారణమని చెప్పవచ్చు.బన్నీకి ఈ జాబితాలో చోటు దక్కడం గురించి ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు.

అయితే ఇదే సమయంలో మరో విషయం నెట్టింట వైరల్ అవుతోంది.

Telugu Allu Arjun, Bunny, Number Place, Pushpa-Movie

గూగుల్ నుంచి అధికారికంగా అలాంటి జాబితా ఏదీ విడుదల కాలేదని కూడా సోషల్ మీడియాలో ఇతర హీరోల ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.అయితే గూగుల్ జాబితా గురించి వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.బన్నీ మాత్రం కెరీర్ విషయంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube