తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఉప సర్పంచ్ మౌనిశ్ తో పాటు ఎంపీటీసీ బోసుపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు.
దాదాపు ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడుతుండగా స్పందించిన స్థానికులు దుండగులలో ఒకరిని పట్టుకున్నారు.అనంతరం కర్రలు, పెట్రోల్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్న గ్రామస్థులు ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.
అయితే దాడికి పాల్పడింది నటుడు మోహన్ బాబుకు చెందిన బౌన్సర్లని బాధితులు ఆరోపిస్తున్నారు.కాగా శ్రీవిద్యానికేతన్ పీఆర్వో, మోహన్ బాబు అభిమానుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఎంపీటీసీ ఆరోపించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇరు వర్గాల వారిని విచారిస్తున్నారు.దీంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.