తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల వాయిదాపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరగనుంది.ఈ మేరకు మధ్యాహ్నం 2.30 గంటలకు న్యాయస్థానం పిటిషన్ ను విచారించనుంది.
ముందుగా జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ కు పిటిషన్ రాగా విచారణ జరిపేందుకు నిరాకరించారు.
అయితే తన కుమార్తె కూడా గ్రూప్స్ రాస్తున్న నేపథ్యంలో విచారణకు ఆయన నిరాకరించారని తెలుస్తోంది.ఈ క్రమంలో జస్టిస్ట్ లక్ష్మణ్ పిటిషన్ ను మరో బెంచ్ కు రిఫర్ చేశారు.
రాష్ట్రంలో గ్రూప్ -1 వాయిదా వేయాలని కోరుతూ 36 మంది అభ్యర్థులు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.