అమెరికాలో తెలుగు యువతీయువకులు గొప్ప ఆలోచన ఈ “టీటీ ట్యూటర్”..!!

దక్షిణాది బాషలకు ఆయా ప్రాంతాలలో మనుగడే ప్రశ్నార్ధకం అవుతున్న తరుణంలో ఎల్లలు దాటి అగ్ర రాజ్యం అమెరికాలో ఉంటున్న నలుగురు యువతీ యువకులు తెలుగు, తమిళ భాషలను అభివృద్ధి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.వీళ్ళ ముఖ్య ఉద్దేశ్యం దక్షిణాది బాషలు అమెరికాలో ఉంటున్న దక్షిణాది వాసులు మాత్రమే కాక ఇతరులు కూడా నేర్చుకోవాలని, తద్వారా తెలుగు, తమిళ భాషలకు అమెరికాలో మరింత ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు.

 Indian Students Started Tutoring Program For Telugu Tamil Language , Telugu, Tam-TeluguStop.com

అయితే ఇంత పెద్దగా ఆలోచన చేసిన ఈ యువతీ యువకులు కేవలం హైస్కూల్ విద్యను అభ్యసించడం అందరిని మరింత ఆశ్చర్యపరుస్తోంది.వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో జార్జియాలో ఓ హైస్కూల్ లో భారత సంతతికి చెందిన సుహాన్, క్రుతికా కాసిరెడ్డి, పోలాకు వినయ్, వేములపల్లి రితిక, చదువుకుంటున్నారు.ఈ నలుగురు కలిసి టీటీ ట్యూటర్( తెలుగు, తమిళ ట్యూటర్ ) అనే సంస్థను స్థాపించారు.

సౌత్ ఫార్మైత్ ప్రాంతంలో దాదాపు 20 మంది విద్యార్ధులకు తెలుగు, తమిళ బాషలను నేర్పుతున్నారు.వీరిలో చిన్నా పెద్ద తేడా లేకుండా 20 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా వీరిదగ్గరకు వస్తున్నారు.

ఐదేళ్ళ చిన్నారి మొదలు 22 ఏళ్ళ వయసు ఉన్నవారు కూడా వీరి దగ్గరకు దక్షిణాది బాషలు నేరుచుకోవడానికి వెళ్తున్నారట.

ప్రస్తుతం సౌత్ ఫార్మైత్ ప్రాంతంలో ఎంతో మంది ఆసియా వాసులు, ఇండియన్స్ ఉన్నారని మన సంస్కృతినే ఎంతో సరళంగా , అర్ధమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నామని ఎంతో మంది నుంచీ స్పందన వస్తోందని అంటున్నారు ఈ స్నేహితులు.

అలాగే వీరికి టీటీ ట్యూటర్ అనే యూట్యూబ్ చానల్ కూడా ఉందట.ఈ నలుగురులో ఒక్కొక్కరు ఒక్కో విభాగంలో నైపుణ్యం కలవారు కావడంతో వీరికి దక్షిణాది బాషలు, సంస్కృతులు చెప్పడం కష్టంగా లేదని అంటున్నారు.

ఒకరు స్టడీ మెటీరియల్ తయారు చేస్తే మరొకరు తెలుగు బాగా చెప్తారని, మరొకరు తమిళం ఇలా ఒక్కొక్కరు ఒక్కో పనిలో ఉంటారని అందుకే సక్సస్ఫుల్ గా టీటీ ట్యూటర్ ను నడుపుతున్నామని చెప్తున్నారు.ఆదిపడుతూ,సరదాగా గడిపే హైస్కూల్ స్థాయి పిల్లలు ఇలా దక్షిణాది బాషా, సంస్కృతులను విదేశాలలో భారతీయుల పిల్లలకు తెలిజేయాలనుకోవడం ఎంతో అభినందించదగ్గ విషయమని అంటున్నారు పలువురు ఎన్నారైలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube