అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి భారతీయుడు తన ప్రతిభతో సత్తా చాటాడు.భారతీయులకి ప్రతిభా పాటవాలు అధికమనే విషయాన్ని మరోసారి అమెరికన్స్ కి గుర్తు చేశాడు.
ఎక్కడికి వెళ్ళినా తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపుని పొందటంలో భారరతీయులకి సాటి మరెవరూ లేరవంటూ మరో సారి నిరూపించారు.ఇంతకీ ఆ భారతీయుడు సాధించింది ఏమిటంటే.
బీహార్ లోని కటిహర్ కి చెందిన రాజ్ అనే భారతీయ విద్యార్ధి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే స్కొలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (సాట్ ) లో చక్కని ప్రతిభ కనబరిచి ప్రపంచ వ్యాప్తంగా మూడో ర్యాంక్ సాధించాడు.ఎంతో కటినమైన ప్రశ్నలతో సాగే ఈ టెస్ట్ లో పాస్ అవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు.
అలాంటిది భారతీయ విద్యార్ధి ఏకంగా 3వ ర్యాంక్ సాధించడం రికార్డ్ క్రియేట్ చేసింది.అసలు ఈ టెస్ట్ ఎందుకు పెడుతారంటే.

అమెరికాలోని వివిధ యూనివర్సిటీలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో టాలెంటెడ్ విద్యార్ధులని ఇలాంటి టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసి స్కాలర్షిప్ప్లు అందిస్తాయి.ఈ కోవకి చెందినదే సాట్ టెస్ట్.అమెరికాలోని కాలేజ్ బోర్డ్ అనే సంస్థ ప్రతీ ఏటా ఈ సాట్ టెస్ట్ నిర్వహిస్తోంది.ఈ పరీక్షలో ప్రతిభ చూపించిన వారికి అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ లో ఆస్ట్రో ఫిజిక్స్ చదవే అవకాశాన్ని కల్పిస్తారు.
ఇప్పుడు రివన్ కూడా ఈ అవకాశం పొందాడు.అతడి చదువు అయ్యేంత వరకూ కూడా అమెరికా ప్రభుత్వమే ఖర్చులు బరిస్తుంది.