తప్పుడు అభియోగాలతో జైలు పాలైన భారతీయ విద్యార్ధి విశాల్ జూడ్ విడుదలకు ఆస్ట్రేలియా కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.నివేదిక ప్రకారం .
న్యూసౌత్‌వేల్స్ పబ్లిక ప్రాసిక్యూటర్లు విశాల్‌పై జాతి విద్వేష ఆరోపణలు సహా ఎనిమిదింటిని తొలగించారు.అయితే సెప్టెంబర్ 16, 2020తో పాటు ఫిబ్రవరి 14, 2021 మధ్య జరిగిన మూడు నేరాలను మాత్రం విశాల్ అంగీకరించాడు.
ఈ నేరానికి శిక్షగా ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి ఆరు నెలల జైలు శిక్ష విధించింది కోర్ట్.
అసలు ఏం జరిగిందంటే.24 ఏళ్ల విశాల్ జూడ్ హర్యానాకు చెందిన వాడు.ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియాకు వచ్చిన అతను ఈ ఏడాది ఏప్రిల్ 16న సిడ్నీలో మూడు నేరాలకు పాల్పడినందుకు గాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖలిస్తానీ వేర్పాటువాదులు, భారత జాతీయ వాదుల ఘర్షణ నేపథ్యంలో ఆయన అరెస్ట్ జరిగింది.అయితే ఈ మూడు కేసుల్లోనూ ఖలిస్తానీయులు బాధితులుగా పేర్కొనబడ్డారు.ఖలిస్తానీయులు.భారత ప్రవాసుల మధ్య ఏళ్లుగా శత్రుత్వం వున్న సంగతి తెలిసిందే.
వివిధ దేశాల్లో వున్న ఖలిస్తానీయులు తాము భారతీయ సంతతికి చెందిన వారమని ఒప్పుకున్నప్పటికీ.భారతీయులమని మాత్రం అంగీకరించరు.
వారి లక్ష్యం ఖలిస్తానీ రాజ్య సాధనే.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఆగస్ట్ 28, 2020న పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
కొందరు టిక్ టాక్‌లో భారత వ్యతిరేక సమాచారాన్ని వ్యాప్తి చేయడమే దీనికి కారణమని పోలీసులు తేల్చారు.
ఆ రోజు ఖలిస్తానీయులు, భారత జాతీయ భావజాలం వున్న రెండు గ్రూపులు స్థానిక హారిస్ పార్క్ వద్ద ఘర్షణకు దిగాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న జాస్సీ తీవ్రంగా గాయపడ్డారు.అయినప్పటికీ అతను మాత్రం వెనక్కి తగ్గలేదు.హిందువులను బెదిరించడం మొదలుపెట్టాడు.అంతేకాకుండా ఒంటరిగా కనిపిస్తే వారిని చితకబాదుతానని చెప్పాడు.
ఇదే సమయంలో భారత్‌లో వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులు- కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.పంజాబ్, హర్యానా, ఢిల్లీలో రైతుల ఆందోళనల నేపథ్యంలో ఖలిస్తానీయులు యాక్టీవ్ అయ్యారు.
రైతులకు వీరు బహిరంగంగా మద్ధతు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియాలోనూ కొందరు భారత వ్యతిరేక నిరసనలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఖలిస్తానీయులు సిడ్నీలోని హారీస్ పార్క్ సమీపంలోకి వెళ్లి.భారతీయుల ఆస్తులను, కార్లను ధ్వంసం చేశారు.ఇదే సమయంలో ఏప్రిల్ 16 తర్వాత విశాల్ జూడ్‌ను సిడ్నీలోని అతని ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ ఘర్షణల్లో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.ఖలిస్తానీయులకు మద్ధతుగానే ఆస్ట్రేలియా పోలీసులు ఉద్దేశపూర్వకంగా విశాల్‌ను అరెస్ట్ చేశారనే వాదనలు వినిపించాయి.
ఈ క్రమంలో సెప్టెంబర్ 1న.విశాల్ న్యాయవాది ప్రాసిక్యూటర్లతో ఒక ఒప్పందానికి వచ్చారు.దీని ప్రకారం.
మూడు గొడవల్లో విశాల్ నేరాన్ని అంగీకరించడంతో మిగిలిన ఆరోపణలను ప్రాసిక్యూటర్లు ఉపసంహరించుకున్నారు.దీంతో విశాల్ విడుదలకు మార్గం సుగమమైంది.