అమెరికాలో దారుణం జరిగింది.పొట్టకూటి కోసం ఉబెర్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏంటంటే నిందితుడు 15 ఏళ్ల బాలుడు కావడం.మృతుడిని కుల్దీప్ సింగ్‌గా గుర్తించారు పోలీసులు.21 ఏళ్ల కుల్దీప్.శనివారం తన కారులోనే కాల్పులకు గురయ్యాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడటంతో అతనిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుల్దీప్ మరణించాడు.
ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటున్న వ్యక్తి మైనర్ కావడంతో అతని పేరును పోలీసులు వెల్లడించలేదు.ఇదే సమయంలో అతని పొత్తికడుపు, ఎడమ తొడపై గాయాలైనట్లుగా తెలుస్తోంది.ఈ బాలుడు ప్రస్తుతం కొలంబియా ప్రెస్బిటేరియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని.అతని ఆరోగ్యంగా స్థిరంగానే వుందని పోలీసులు తెలిపారు.
యువకుడు .సింగ్ కారులో వెనుక సీటులో వున్న ప్రయాణీకుడితో వివాదానికి దిగడంతో పాటు వెనుక వైపు తలుపు తెరిచినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.దీంతో సదరు ప్రయాణీకుడు.యువకుడిపై కాల్పులు జరపడంతో పాటు దాడికి పాల్పడ్డాడని .ఇదే సమయంలో ఆ యువకుడు సైతం ఎదురుకాల్పులకు దిగినట్లు పోలీసులు వెల్లడించారు.అయితే అనుకోకుండా సింగ్ తలపై ఆ యువకుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

పోలీసుల గణాంకాల ప్రకారం.న్యూయార్క్ నగరంలో ఇప్పటి వరకు 1,086 కాల్పులు, 314 హత్యలు, 1009 అత్యాచారాలు, 14,783 తీవ్రమైన దాడులు సంభవించాయి.2012-13 తర్వాత న్యూయార్క్‌లో గతేడాది హత్యలు, తీవ్రమైన దాడి ఘటనలు పెరిగినట్లు పోలీసులు తెలిపారు.దీనికి సమాంతరంగానే అత్యాచారాలు కూడా చోటు చేసుకున్నాయని వెల్లడించారు.
కోవిడ్ 19 కారణంగా గడిచిన రెండేళ్లకాలంలో నేరాల తీవ్రత తగ్గిందని అధికారులు తెలిపారు.