భారత సంతతికి చెందిన ఉగాండా విద్యావేత్త , రచయిత మహమ్మద్ మమదానీ .గ్లోబల్ కల్చరల్ అండర్ స్టాండింగ్‌కి గాను 2021 బ్రిటీష్ అకాడమీ బుక్ ప్రైజ్‌కి షార్ట్ లిస్ట్ అయ్యారు.25,000 జీబీపీ విలువైన ఫిక్సన్ బహుమతికి ఎంపికైన నలుగురు రచయితలతో మమదానీ ఒకరు.బ్రిటీష్ అకాడమీ ప్రకటన ప్రకారం.
మహమ్మద్ మమదానీ (75) తన పుస్తకం ‘‘Neither Settler nor Native: The Making and Unmaking of Permanent Minorities’’ ద్వారా ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి షార్ట్ లిస్ట్ అయ్యారు.రాజకీయ ఆధునికత, వలస రాజ్యం, పోస్ట్‌కలోనియల్‌పై మమదానీ లోతైన విచారణతో పాటు వలస సమాజాన్ని వేధిస్తున్న హింస మూలాలను అద్భుతంగా వివరించారు.
మహమ్మద్ మమదానీ కొలంబియా యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ స్కూల్‌లో హెర్బర్ట్ లెమాన్ ప్రభుత్వ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు.ఆయన 1974లో హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ అందుకున్నారు.
అలాగే ఆఫ్రికన్ చరిత్ర, రాజకీయాల అధ్యయనంలో మమదానీకి ప్రత్యేకత వుంది.అంతేకాకుండా ఉగాండాలోని మేకరేర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ (ఎంఐఎస్ఆర్) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
భారతీయ అమెరికన్ చిత్ర నిర్మాత మీరా నాయర్‌ను మహమ్మద్ మమదానీ వివాహం చేసుకున్నారు.
బ్రిటీష్ అకాడమీ ప్రకారం.
‘Neither Settler nor Native: The Making and Unmaking of Permanent Minorities’’ పుస్తకంలో మమదానీ.శక్తివంతమైన అసలైన వాదనను వినిపించారని న్యాయనిర్ణేతలు ప్రశంసించారు.
వలసవాద సమస్యలు, పర్యవసానాలను అన్వేషించడంలో ఈ పుస్తకం బలంగా వుందని తెలిపారు.పోస్ట్ -కలోనియల్ పరిస్థితులలో తీవ్రమైన జెనోఫోబిక్ హింసకు కారణమైనట్లు మమదానీ ప్రస్తావించారు.
ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి ముందు జరగాల్సిన రాజకీయాల పునరేకీకరణ కోసం ఆయన పుస్తకంలో కొన్ని సూచనలు చేశారు.

ఇక బ్రిటీష్ అకాడమీ పుస్తకానికి షార్ట్‌లిస్ట్ అయిన వారిలో శ్రీలంకలో జన్మించిన కేంబ్రిడ్జ్ చరిత్రకారుడు సుజిత్ శివసుందరం (Waves across the South: A New History of Revolution and Empire), స్కాట్లాండ్‌కి చెందిన కాల్ ఫ్లిన్ (Islands of Abandonment: Life in the Post-Human Landscape), ఎడ్డీ ఎస్ గ్లాడ్ జూనియర్ (Begin Again: James Baldwins) వున్నారు.