చాలా సంవత్సరాల క్రితం భారతదేశానికి చెందిన చాలామంది ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లి జీవిస్తున్నారు.అలా జీవించిన వారిలో ఈ మధ్యకాలంలో ఆ దేశాలలోని ముఖ్యమైన రాజకీయ పదవులను సొంతం చేసుకుని ఆ దేశాలనే పాలిస్తూ ముందుకు వెళుతున్నారు.
ఈ మధ్యకాలంలో భారత సంతతికి చెందిన వాళ్ళు విదేశాల్లో జీవించడమే కాకుండా అక్కడి రాజకీయాల్లో వారు తమదైన ముద్రను వేస్తున్నారు.ఈమధ్య బ్రిటన్ ప్రధానిగా రిసీ సునాక్ పద్ధతులు చేపట్టిన విషయం తెలిసిందే.తాజాగా భారత సంతతికి చెందిన లియో వరాద్కర్ ఐర్లాండ్ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు.
43 సంవత్సరాల లియో ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నిక కావడం ఇది రెండవసారి.ఫింగెల్ పార్టీకి చెందిన ఈయన 2017 నుంచి 2020 వరకు ఐర్లాండ్ ప్రధానిగా చేశారు.ఐర్లాండ్ లోని యువ నాయకులలో కూడా ఒకరు.అంతేకాకుండా తను ఒక గే అని ఆయన బహిరంగంగా కూడా ప్రకటించడం జరిగింది.కరోనా సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించినందుకు చాలా మంది ఆయనకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా 2016 లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐర్లాండ్ కు ఆర్థిక కష్టాలు రాకుండా చూశారనే లియోకు మంచి పేరు కూడా ఉంది.కేథలిక్ మైనారిటీలు ఎక్కువగా ఉండే ఐర్లాండ్ లో లియో ఒక రాజకీయ శక్తిగా ఎదగడం అనేది ఆ మామూలు విషయం మాత్రం కాదు.లీయో తండ్రి పేరు అశోక్ మహారాష్ట్రలోని వరాద్ గ్రామానికి చెందిన ఈయన ఒక డాక్టర్.ఐర్లాండ్ కు 1960లో వలస వెళ్లి అప్పటినుంచి అక్కడే జీవిస్తున్నారు.అక్కడ నర్సు గా పని చేస్తున్న ఐలాండ్ యువతీని ఆయన పెళ్లి చేసుకొని లియోకు జన్మనిచ్చాడు.2019లో తన తండ్రి స్వగ్రామమైన లియో వచ్చి వెళ్లడం విశేషం.