అమెరికా: స్టార్టప్‌ పేరిట పెట్టుబడిదారులకు భారీగా టోకరా.. భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌ అరెస్ట్

డిచిన రెండు , మూడు రోజులుగా అమెరికాలో భారతీయులు పలు మోసాల్లో ఇరుక్కుని జైలు పాలవుతున్నారు.తాజాగా అదే అమెరికాలో భారత సంతతికి చెందిన మాజీ టెక్ సీఈవో .

 Indian-origin Ex-ceo Of Mobile App Startup Charged With Fraud In Us , Manish Lac-TeluguStop.com

పెట్టుబడిదారులను దాదాపు 80 మిలియన్ డాలర్ల మేర మోసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు.వివరాల్లోకి వెళితే.

మనీష్ లచ్వానీ (45) గతంలో హెడ్‌స్పిన్ సహ వ్యవస్థాపకుడగా, సీఈవోగా వ్యవహరించారు.

న్యాయశాఖ ప్రకారం.

మనీష్ 2015 నుంచి 2020 మార్చి వరకు హెడ్‌స్పిన్ మొబైల్ యాప్ టెస్టింగ్ ఫ్లాట్‌ఫాం రూపొందించేందుకు పెట్టుబడిదారుల నుంచి 100 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేశారు.అనంతరం ఈ వ్యాపార లావాదేవీలకి సంబంధించి లచ్వానీ పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారాన్ని అందించినట్లుగా అధికారులు తెలిపారు.

అంతేకాకుండా మనీష్ అనేక సందర్భాల్లో ఉద్యోగులను సైతం ఆదాయం పెంచేలా ఒత్తిడి తెచ్చారని చెప్పారు.ఫిర్యాదుల నేపథ్యంలో మే 2020లో కంపెనీ ఆడిట్ చేయని ఆర్ధిక నివేదికలను ఆడిటింగ్ సంస్థ సమీక్షించింది.ఈ సందర్భంగా హెడ్ స్పిన్ తన కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి 2020 ప్రథమార్ధం వరకు మొత్తం ఆదాయం 95.3 మిలియన్లకు బదులుగా కేవలం 26.3 మిలియన్లు మాత్రమే అని తేలింది.

హెడ్‌స్పిన్ స్టార్టప్‌ను ప్రారంభించడానికి ముందు.లచ్వానీ అమెజాన్ టాబ్లెట్ కిండ్ల్ కోసం తొలి ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.2014లో గూగుల్ కొనుగోలు చేసిన మొబైల్ టెస్టింగ్ ఫ్లాట్‌ఫామ్ అపురిఫైని అభివృద్ధి చేయడంలోనూ సహాయ పడ్డారు.పెట్టుబడిదారులను మోసం చేసిన ఈ కేసులో ఆయన నేరం రుజువైతే.గరిష్టంగా 20 ఏళ్ల జైలుతో పాటు భారీ జరిమానా వుంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube