“DISMANTLING GOLBAL HINDUTVA” (హిందుత్వాన్ని ఎలా కూల్చేయాలి), ఏంటి షాక్ అయ్యారా అవును ప్రతీ భారతీయుడు, ప్రతీ హిందువు ఈ పదం వినగానే ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాదు ఈ దారుణమైన చర్యలు ఎవరు చేపడుతున్నారు అంటూ కోపంతో ఊగిపోతారు కూడా.అమెరికాలో ఇప్పుడు ఓ వర్గం హిందుత్వాన్ని ఎలా కూల్చేయాలి అనే విషయంపై చర్చలు చేపడుతోందట.
పెద్ద పెద్ద మేధావులు, జర్నలిస్టులు, హిందూ వ్యతిరేకులు చర్చా వేదికలో పాలు పంచుకోనున్నారట, అంతేకాదు ఈ కాన్ఫరెన్స్ కు అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ లు స్పాన్సర్ చేస్తున్నాయట.ఇది ప్రస్తుతం హిందుత్వంపై అగ్ర రాజ్యంలో చేపడుతున్న చర్యలు.
అత్యంత పురాతనమైన హిందూ మతాన్ని ఎలా అణగదొక్కాలి, హిందుత్వాన్ని అత్యంత భయంకరమైన రాక్షసిగా ఎలా ప్రపంచానికి చూపించాలి అనే విషయంపై సెప్టెంబర్ 10 నుంచీ 13 తేదీ వరకూ చర్చలు జరగున్నాయట, హిందుత్వం అనేది కేవలం రాజకీయ ఐడియాలజీ గా మాత్రమే ఉపయోగపడుతుందని, దీనివలన ఎవరికీ ఉపయోగం లేదని హిందుత్వం భారత్ ను నాశనం చేస్తోందని ఈ చర్చను నిర్వహిస్తున్న నిర్వాహకులు వాదిస్తున్నారు.ఈ సమావేశానికి 40 యూనివర్సిటీలు స్పాన్సర్ చేస్తున్నాయని నిర్వాహాకులు తెలిపారు.
అయితే అమెరికాలో ఉన్న భారతీయ ఎన్నారై సంఘాలు ఈ చర్చా వేదికపై భగ్గుమన్నాయి.అమెరికాలో ఉన్న హిందూ అమెరికన్ ఫౌండేషన్ డైరెక్టర్ సమీర్ మాట్లాడుతూ ఈ చర్చలు నిర్వహించడానికి వీలు లేదని, ఇది భారత దేశంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు.
ఈ కార్యక్రమాన్ని ఆపాలని, నిర్వహణ కోసం యూనివర్సిటీ లు ఇస్తున్న స్పాన్సర్ షిప్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు.హిందుత్వం ఎంతో మందికి ఆదర్శంగా ననిలిచిందని, అత్యంత పురాతనమైన హిందుత్వాన్ని కించపరిచేలా ఈ కార్యక్రమం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.