ఒకే ఫ్రేమ్ లో సూపర్ స్టార్స్.. కమల్, చిరు, సల్మాన్ కలయిక ఎందుకు జరిగిందబ్బా!

మన భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక్కో ఇండస్ట్రీలో కొంతమంది దిగ్గజ నటులు ఉన్నారు.వారి వారి ఇండస్ట్రీలలో వారు సూపర్ స్టార్స్ గా ప్రజల చేత అభినందించ బడుతున్నారు.

 Indian Cinema Legends Chiranjeevi Kamal Salman Khan Sensational Meet Details, Ch-TeluguStop.com

మరి మన తెలుగు పరిశ్రమలో దిగ్గజ నటులలో మెగాస్టార్ చిరంజీవి అయితే తమిళ్ ఇండస్ట్రీలో లోక నాయకుడిగా నటుడిగా కమల్ హాసన్ ప్రేక్షకుల చేత ఆరాధించ బడుతున్నారు.ఇక హిందీ ఇండస్ట్రీలో అయితే సల్లూ భాయ్ గా సల్మాన్ ఖాన్ కు విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరి ఇలాంటి మూడు ఇండస్ట్రీల దిగ్గజ నటులు ఒకే ఫ్రేమ్ లో కలవడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది.అలాంటి అరుదైన ఘటన ఇప్పుడు జరిగింది.

కమల్ హాసన్ ఇటీవలే విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.చాలా రోజుల తర్వాత హిట్ అందుకోవడంతో కమల్ తో పాటు టీమ్ అంతా చాలా సంతోషంగా ఉంది.

సక్సెస్ ఇచ్చిన సంతోషంలో అందరు సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసారు.ఈయన సినీ సెలెబ్రిటీలు సైతం అభినందనలు తెలిపారు.ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య కూడా నటించారు.

భారీ హిట్ కొట్టిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి కమల్ హాసన్ కు శాలువా కప్పి బొకే తో సత్కరించిన సందర్భంగా మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేసారు.ఈ ఫొటోలో దిగ్గజ నటులు మెగాస్టార్, కమల్ హాసన్, సల్మాన్ ఖాన్ లతో పాటి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా ఉన్నాడు.

మెగాస్టార్ ఈ ఫోటో షేర్ చేస్తూ విక్రమ్ తో మంచి విజయాన్ని అందుకున్నందుకు నా ఓల్డెస్ట్ ఫ్రెండ్ కమల్ హాసన్ కు అభినందనలు అలాగే లోకేష్ మరియు అతడి టీమ్ అందరికి కూడా అభినందనలు తెలుపుతున్నాను అంటూ మెగాస్టార్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.

ఒకే ఫ్రేమ్ లో ముగ్గురి దిగ్గజ నటుల కలయికతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube