ఫాసిజం నుంచి భారత్‌ను రక్షించండి: మోడీకి వ్యతిరేకంగా వైట్‌హౌస్ ఎదుట ఇండో అమెరికన్ల నిరసన

మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అగ్రరాజ్యంలో అడుగుపెట్టారు.ప్రవాస భారతీయులతో పాటు అమెరికా అధికారులు, నేతలు ఆయనకు సాదర స్వాగతం పలుకుతున్నారు.

 Indian Americans Protest Outside White House Over Modi’s Visit, Indian America-TeluguStop.com

అక్కడి టెక్ దిగ్గజాలు, క్వాడ్ దేశాధినేతలతో భేటీతో పాటు అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు జో బైడెన్, కమలా హారీస్‌తోనూ ప్రధాని సమావేశమయ్యారు.ఈ క్రమంలో మోడీకి అమెరికా పర్యటనలో ఊహించని షాక్ తగిలింది.

ప్రధాని అమెరికా పర్యటనను నిరసిస్తూ.పదుల సంఖ్యలో ప్రవాస భారతీయులు వైట్‌హౌస్ వద్ద నిరసనకు దిగారు.

శ్వేతసౌధానికి ఎదురుగా వున్న లాఫాయెట్ స్క్వేర్‌లో వారు ఆందోళన నిర్వహించారు.

ఫాసిజం నుంచి భారతదేశాన్ని కాపాడాలంటూ రాసివున్న ప్లకార్లును పట్టుకుని వారు నినాదాలు చేశారు.దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు, ముస్లింలు, ఇతర మైనారిటీలపై వేధింపులు, కొత్త వ్యవసాయ చట్టాలు, కాశ్మీర్‌లో ఉద్యమాల అణిచివేతపై ఆందోళనకారులు నిరసన తెలిపారు.2014లో తొలిసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మోడీ మతపరమైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీకి ముందు వీరు నిరసన తెలిపారు.గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్బంగా బైడెన్, కమలా హారిస్‌లు కాశ్మీర్‌లో అణిచివేతలు, అస్సాంలో ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాల అమలును ఖండించిన సంగతి తెలిసిందే.

Telugu Indianamericans, Modi Joe Biden, Pm Modi, Pm Modi America, White-Telugu N

కాగా, ఈ ఏడాది జూలైలో భారతదేశాన్ని “country of particular concern” (CPC) గా గుర్తించాలని ప్రపంచవ్యాప్తంగా 30కి పౌర హక్కుల సంస్థలు తీర్మానం చేసి అమెరికా ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా మత వివక్షను ప్రోత్సహించే అధికారులు, హిందుయేతరులను బహిరంగంగా శిక్షించాలంటూ కోరాయి.అమెరికాలో అంతర్జాతీయ మత స్వేచ్ఛ ప్రారంభ సదస్సు సందర్భంగా ఈ తీర్మానాన్ని ఆమోదించారు.అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మోడీ ప్రభుత్వం మతవివక్షను పాటిస్తున్నప్పటికీ.అమెరికా చూసీచూడనట్లు వదిలివేయడంపై వారు మండిపడుతున్నారు.

Telugu Indianamericans, Modi Joe Biden, Pm Modi, Pm Modi America, White-Telugu N

యూనైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్ఎఫ్) గతేడాది భారత్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని నాటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.సీఏఏ చట్టం వల్ల భారతదేశంలో మైనారిటీల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని యూఎస్‌సీఐఆర్ఎఫ్ 2020 ఏప్రిల్‌లో విడుదల చేసిన తమ వార్షిక నివేదికలో తెలిపింది.అంతేకాకుండా భారత ప్రభుత్వ ఏజెన్సీలు, అధికారులకు చెందిన ఆస్తులను ఫ్రీజ్ చేసేలా ఆంక్షలు తీసుకొచ్చి వారిని అమెరికాలోకి రాకుండా నిషేధించాలని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌ను కోరింది.అయితే నివేదికలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను యూఎస్‌సీఐఆర్ఎఫ్‌లోని ఇద్దరు కమిషనర్లు తప్పు పట్టడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube