న్యూజెర్సీ: వరదల్లో కొట్టుకుపోయిన భారత సంతతి టెక్కీ.. భారీ రెస్క్యూ ఆపరేషన్, చివరికి

అమెరికాలో హరికేన్ ఇడా భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.తుఫాను వల్ల సంభవించిన వరదలు, టోర్నడోల ధాటికి 45 మంది చనిపోయినట్లు అంచనా.

 Indian American Software Designer From New Jersey Succumbs To Floodwaters In Aft-TeluguStop.com

చాలా మంది ఇళ్లలోకి వరద నీరు పోటెత్తడం తప్పించుకునే వీలులేక మునిగి మరణించారు.న్యూజెర్సీలో 23 మంది మరణించగా.

న్యూయార్క్లో 13 మంది చనిపోయారు.అందులో 11 మంది ఇంటి బేస్మెంట్లోనే వరదలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

పెన్సిల్వేనియాలో ఐదుగురు, వెస్ట్చెస్టర్లో ముగ్గురు , మేరీలాండ్లో ఒకరు మృతిచెందారు.వర్షం మొదలైన అరగంటలోనే వరద నీరు ఛాతి దాకా పెరిగిపోయిందని బాధితులు వెల్లడించారు.

కొన్ని చోట్ల వరద నీరు అపార్ట్మెంట్లలోని మొదటి అంతస్తు వరకు చేరిందని, ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బయటపడ్డామని వాపోయారు.అయితే, ఇంతకుముందు కూడా ఇలాంటి తుఫాన్లు వచ్చినా.

ఇప్పుడు వాతావరణంలో మార్పుల వల్ల తుఫాను ఇంత తీవ్రరూపంలో విరుచుకుపడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.వాతావరణం ఎంతగా వేడెక్కితే.

వానలు అంత ఎక్కువగా పడే ముప్పున్నట్టేనని హెచ్చరించారు.
కాగా.

న్యూయార్క్, న్యూజెర్సీలలో సంభవించిన వరదల్లో నలుగురు భారత సంతతి వ్యక్తులు, ముగ్గురు నేపాలీ జాతీయులు మరణించినట్లు అధికారులు తెలిపారు.అయితే భారత సంతతికి చెందిన ఓ మహిళా టెక్కీ వరదల్లో కొట్టుకుపోయిన సంగతి తెలుసుకున్న సహాయక బృందాలు భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి.

కానీ దురదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.న్యూజెర్సీలోని రారిటన్‌కు చెందిన మాలతీ కంచె అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వరదల్లో గల్లంతై సెప్టెంబర్ 3న మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

Telugu America, Floods, Hurricane Ida, Indianamerican, Jersey, Rescue-Telugu NRI

మాలతీ గల్లంతైన విషయం తెలుసుకున్న సోమెర్‌సెట్ కౌంటీ అధికారులు వెంటనే స్పందించారు .సహాయ బృందాలు డ్రోన్‌ల సాయంతో ఆమె జాడను కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.ఈ నేపథ్యంలో మాలతీ కుటుంబానికి చెందిన సన్నిహితుడొకరు.మాన్సీ మాగో వద్ద ఆమె మృతదేహాన్ని కనుగొన్నట్లు కథనాలు వెలువడ్డాయి.

మాలతీ సెప్టెంబర్ 1 సాయంత్రం తన కుమారుడిని రట్జర్స్ యూనివర్సిటీ వద్ద వదిలిపెట్టి.న్యూజెర్సీలోని బ్రిడ్జ్‌వాటర్ రూట్ నెం 22 మీదుగా తన ఇంటికి బయల్దేరారు.

అయితే అప్పటికే వరద నీరు రోడ్లపై పోటెత్తినా ఆమె తన చిన్న ఎస్‌యూవీలో అలాగే డ్రైవింగ్ చేశారు.ఆ కాసేపటికే వరద ప్రవాహం ఎక్కువ కావడంతో వారి కారు నిలిచిపోయింది.

అదే సమయంలో వరద ధాటికి మాలతీ, ఆమె 15 ఏళ్ల కూతురు కొట్టుకుపోయారు.అయితే మాలతీ కుమార్తె ఈదుకుంటూ వెళ్లడంతో ఆమెను స్థానికులు రక్షించారు.

కానీ మాలతీకి ఈత రాకపోవడంతో వరద ప్రవాహంలో గల్లంతయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube