నేడు ఆసియా కప్ ఫైనల్ పోరు..భారత్, శ్రీలంక ఇరు జట్ల బాలబలాలు ఎలా ఉన్నాయంటే..?

ఆసియా కప్ 2023( Asia Cup 2023 ) టైటిల్ కోసం నేడు భారత్-శ్రీలంక( India vs Srilanka ) జట్ల మధ్య ఉత్కంఠ భరితమైన పోరు జరుగనుంది.నేడు శ్రీలంకలోని కొలంబో వేదికగా మధ్యాహ్నం 3:00 గంటలకు భారత్, శ్రీలంక జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.కొలంబోలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుంది.కాబట్టి ఈరోజు ఇరు జట్ల స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంది.సొంత గడ్డపై ఆడుతున్న శ్రీలంకకు కలిసొచ్చే అంశమే అయిన శ్రీలంక జట్టు కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయం కారణంగా నేడు జరిగే మ్యాచ్ కు దూరం అవడం ఒకరకంగా శ్రీలంక జట్టుకు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది.భారత జట్టు ఈ మ్యాచ్ లో విజేతగా నిలిచి టైటిల్ గెలవాలంటే.

 India Vs Sri Lanka Asia Cup 2023 Final Match Analysis Details, India Vs Sri Lank-TeluguStop.com

భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది.

Telugu Asia Cup, Asia Cup Final, Bcci, Cricket, India, India Sri Lanka, Kl Rahul

భారత జట్టు ఓపెనర్లైన రోహిత్ శర్మ,( Rohith Sharma ) శుబ్ మన్ గిల్( Subhman Gill ) మంచి ఫామ్ ను కొనసాగిస్తూ మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు.నేడు జరిగే ఫైనల్ మ్యాచ్ లోను వీరిద్దరూ మంచి ఆరంభాన్ని ఇస్తే భారత్ వైపు సగం విజయం చేరినట్టే.ఇక విరాట్ కోహ్లీ సూపర్-4 మ్యాచ్లో విఫలం అయినప్పటికీ నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో రాణిస్తే ఇక టైటిల్ భారత్ ఖాతాలో పడుతుంది.

ఇక మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా తమ వంతు కృషి కాస్త మెరుగ్గా చేయాల్సి ఉంటుంది.ఇక భారత జట్టు బౌలింగ్ విభాగంలో చాలా మెరుగ్గానే ఉంది.

Telugu Asia Cup, Asia Cup Final, Bcci, Cricket, India, India Sri Lanka, Kl Rahul

శ్రీలంక జట్టు స్పిన్ బౌలింగ్ చాలా మెరుగ్గా ఉంది.భారత బ్యాటర్లు ఒకవేళ తొందరగా పెవిలియన్ చేరితే టైటిల్ చేజారే అవకాశం ఉంది.భారత బౌలర్లు తొందరగా రెండు లేదా మూడు వికెట్లు తీస్తే శ్రీలంక జట్టు పరుగులు చేయడంలో విఫలం అయ్యి ఘోర ఓటమిని పొందే అవకాశం ఉంది.ఆసియా కప్ చరిత్రలో భారత్ ఏడుసార్లు టైటిల్ గెలవగా.

శ్రీలంక ఆరుసార్లు టైటిల్ గెల్చుకుంది.నేడు జరిగే మ్యాచ్ కు ఒకవేళ వర్షం అంతరాయం కలిగిస్తే రిజర్వ్ డే లో భాగంగా సోమవారం మ్యాచ్ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube