కోకో దీవులలో చైనా నిఘా సౌకర్యాలు ఏర్పాటు.. మయన్మార్‌ను నిలదీసిన ఇండియా..

బంగాళాఖాతంలోని కోకో దీవుల్లో( COCO Islands ) చైనా నిఘా సౌకర్యాలను ఏర్పాటు చేయడంపై భారత్ ఆందోళన చెందుతోంది.ఎందుకంటే ఈ ప్రాంతంలో భారతదేశం యొక్క క్షిపణి ప్రయోగాలు, వ్యూహాత్మక ఆస్తులను పర్యవేక్షించడానికే చైనా ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసింది.

 India Raises Concerns About Chinese Surveillance Facilities At Coco Islands With-TeluguStop.com

అయితే కోకో దీవులు ఉన్న మయన్మార్, చైనా తమ దేశంలో ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయలేదని ఖండించింది.అయినా వారి సమాధానంతో భారతదేశం సంతృప్తి చెందలేదు.

2021లో మిలటరీ తిరుగుబాటు తర్వాత మయన్మార్ అంతర్జాతీయంగా ఏకాకి అయింది.దీనివల్ల ఈ దేశం చైనా మద్దతుతో బతుకు ముందుకు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.అలా ఇది చైనా( China ) ఏం చెప్పినా వినే క్లిష్ట పరిస్థితిలో ఇరుక్కుపోయింది.మరోవైపు మయన్మార్‌కు చైనా పెద్దపీట వేసి బంగాళాఖాతంలో, హిందూ మహాసముద్రంలో ఆధిపత్యాన్ని నెలకొల్పాలనుకుంటోంది.

ఉపగ్రహ చిత్రాలలో( Satellite Pics ) కోకో దీవులలో విస్తరించిన రన్‌వే కనిపించింది.అంతేకాదు, గూఢచార సమాచారం ప్రకారం సైనిక ఆశ్రయాలు నెలకొల్పినట్లు తెలిసింది.చైనా బలగాలు కూడా కోకో దీవులలో మోహరించినట్లు ఇండియా తెలుకుంది.ఈ ద్వీపాన్ని సమీపంలోని మరొక ద్వీపంతో అనుసంధానించడానికి వీలుగా నిర్మాణ కార్యకలాపాలు కూడా చేపట్టారు.విశాఖపట్నం సమీపంలోని తన నౌకాదళ స్థావరం నుంచి చైనా తన అణు జలాంతర్గాములను, బాలేశ్వర్‌ నుంచి క్షిపణి పరీక్షలను పర్యవేక్షించగలదని భారతదేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

భారతదేశం మయన్మార్‌( Mayanmar )తో ఈ సమస్యను చర్చిస్తూనే ఉంటుంది, అయితే ఇండియా తన క్షిపణి పరిధిని చైనా పర్యవేక్షించగలదని, ఈ ప్రాంతంలో తన సైనిక సామర్థ్యాల గురించి సమాచారాన్ని సేకరించగలదని తెలిసి చాలా డిస్టర్బ్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube