డైలీ 3జీబీ డేటాతో ఎయిర్‌టెల్ రెండు అదిరిపోయే ప్లాన్స్ లాంచ్..

టెలికాం కంపెనీ అయిన భారతీ ఎయిర్‌టెల్( Airtel ) తమ కస్టమర్ల వివిధ అవసరాలకు సరిపడా డేటాను ఆఫర్ చేసే కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది.రోజుకి 3జీబీ డేటాను అందించే ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను తాజాగా ప్రవేశపెట్టింది.

 Airtel Offers New 3gb Data Plans,airtel, Airtel New Plans, Prepaid Plans, 3gb Pl-TeluguStop.com

ఈ ప్లాన్‌లు ఏవి, ఏం ఆఫర్స్ అందిస్తున్నాయో చూద్దాం.

ఎయిర్‌టెల్ కొత్తగా రూ.499 ప్లాన్( Airtel 499 Plan ) పరిచయం చేసింది.ఇది రోజూ 3GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ లోకల్, STD, రోమింగ్ కాలింగ్‌ను అందిస్తుంది.

ఈ ప్లాన్‌లో రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి.ఇది 28 రోజుల వాలిడిటీతో వస్తుంది.

ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌తో కొన్ని అదనపు రివార్డ్‌లను అందిస్తుంది.వాటిలో అన్‌లిమిటెడ్ 5G డేటా, సోనీ లివ్, హోచోయ్, లయన్స్‌గేట్ ప్లే వంటి 15+ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందించే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌కు ఫ్రీ మెంబర్షిప్( Disney Hotstar Free Membership ), వింక్ మ్యూజిక్, ఉచిత హెలోట్యూన్స్‌ ఉన్నాయి.

ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన మరొకటి రూ.699 ప్లాన్.ఇది అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 3జీబీ డేటా, రోజుకు 100 SMSలను అందిస్తుంది.ఇది 56 రోజుల వరకు వాలిడిటీతో వస్తుంది.

ఇది అన్‌లిమిటెడ్ 5G డేటా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్( Amazon Free Prime Membership ), అపోలో 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, ఉచిత హెలోట్యూన్స్ వంటి ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

ఎయిర్‌టెల్ తమ కస్టమర్లు తమ డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచుకోవడానికి తగినంత డేటా, అదనపు రివార్డ్‌లను కలిగి ఉండేలా చూసుకోవాలనుకుంటోంది.

అందుకే తాజాగా ఈ కొత్త ప్లాన్లను పరిచయం చేసింది.డేటా ఎక్కువ వాడేవారు ఈ ప్లాన్లను ఒకసారి పరిశీలించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube