ఉత్తర కొరియాకు భారత్ భారీ సాయం

ఉత్తర కొరియా.ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం గురించి తెలియని వారు ఉండరు.

 India Is A Huge Help To North Korea,north Korea,india-TeluguStop.com

ఆ దేశ అధినేత కిమ్ జోన్ ఉన్ దూకుడు స్వభావం, వివాదస్పదమైన నిర్ణయాలతో ప్రపంచం దృష్టిని మొత్తం తమ దేశంపైకి తిప్పుకున్నాడు.అయితే, ఎప్పుడు క్షిపణి ప్రయోగాలతో హడలెత్తించే ఉత్తర కొరియా ఇప్పుడు ఆపదలో పడింది.

ఈ ఆపద నుంచి ఆ దేశాన్ని గట్టేక్కించడానికి భారత్ భారీ సాయం చేయనుంది.ఉత్తర కొరియాలో భారీగా టీబీ నిరోధక ఔషధాల కొరత ఏర్పడింది.

ఈ క్రమంలో ఉత్తర కొరియాకు క్షయ వ్యాధి నిరోధక ఓషదాలు పంపించి ఆదుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను కోరింది.

డబ్ల్యూహెచ్ఓ వినతిపై స్పందించిన భారత్.

ఉత్తరకొరియాకు సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు మిలియన్ డాలర్ల విలువ చేసే టీబీ మందులను ఉత్తరకొరియాకు పంపనుంది.

ఉత్తరకొరియాలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ అభ్యర్థన మేరకు ఈ ఔషధాలను పంపిస్తున్నామని వివరించింది.

కాగా, ఉత్తరకొరియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube