నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు.
ప్రారంభోత్సవం అనంతరం నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులకు మోదీ సన్మానం చేశారు.సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న మోదీ పార్లమెంట్ భవనంలోని లోక్ సభ స్పీకర్ కుర్చీ వద్ద సెంగోల్ ను ప్రతిష్టించారు.
అయితే పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 20 విపక్ష పార్టీలు బహిష్కరించిన సంగతి తెలిసిందే.