దేవదాసు సినిమా( Devadasu Movie ) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు గోవా ముద్దుగుమ్మ ఇలియానా( Ileana ).మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తన రెండవ సినిమాని మహేష్ బాబుతో నటించే అవకాశం అందుకున్నారు.
ఇలా మహేష్ బాబుతో నటించిన పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈమె ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఇలా ఇండస్ట్రీలో భరోసా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా అగ్రతారగా వెలిగినటువంటి ఇలియానా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే ఈమె పెళ్లి కాకుండా తల్లి కాబోతున్నానంటూ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసాయి.
ఇలా ఈమె తల్లి కాబోతుందన్న విషయం తెలియడంతో పెద్ద ఎత్తున ఈమెపై ట్రోల్స్ వచ్చాయి.అయితే వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ప్రెగ్నెన్సీకి ( Pregnancy ) సంబంధించిన విషయాలను అందరితో పంచుకుంటున్నారు.అలాగే తన బేబీ బంప్( Ileana Baby Bump ) ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు.ఈ క్రమంలోనే అభిమానులు అడిగే ప్రశ్నలకు తన స్టైల్ లో సమాధానం చెప్పారు.
ప్రెగ్నెన్సీ సమయంలో మీకు ఏదైనా వింతగా తినాలనిపించిందా అంటూ నేటిజన్స్ ప్రశ్నించడంతో తనకు మినీ క్యారెట్స్ తినాలనిపించింది అంటూ సమాధానం చెప్పారు.అయితే ఎక్కువగా బీచ్లలో బికినీ వేసుకొని పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఉంటారు.మీకు బీచ్ హౌస్ ( Beach House ) ఉందా ఎప్పుడు చూసినా బీచ్ లోనే గడుపుతుంటారు అంటూ ప్రశ్నించారు.అయితే ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ… ప్రస్తుతానికి లేదని బీచ్ అంటే తనకు ఎంతో ఇష్టం ఆ ప్రశాంతమైన వాతావరణం నా మనసును శాంతపరిచి సంతోషంగా ఉండేలా చేస్తుంది అందుకే తాను ఎక్కువగా బీచ్ లో కనిపిస్తుంటానంటూ ఈ సందర్భంగా ఇలియానా చెప్పిన ఈ సమాధానం వైరల్ అవుతుంది.