పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి ఎలా ఉండాలి అనే దాని గురించి ప్రతి ఒక్కరికీ ఒక ఆలోచన ఉంటుంది.ఐడియల్ హస్బెండ్( Ideal husband ) లేదా ఐడియల్ వైఫ్‌కు మంచి మనసు, పని చేసే తత్వం, సెన్స్ ఆఫ్ హుమర్, వాల్యూస్ ఉండాలని అందరూ కోరుకుంటారు.
ఊహించుకున్నట్లుగా అలాంటి వ్యక్తిని కనుక్కోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ముఖ్యంగా గర్ల్స్ తమ కాబోయే భర్త ఎలా ఉండాలో ఫుల్ క్లారిటీ కోసం ఒక లిస్ట్ చేసుకుంటారు.
ఆ లిస్ట్‌లో ఆ వ్యక్తి ఎలా కనిపించాలి, స్వభావం ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ శైలి ఎలా ఉండాలి అనే విషయాలను ఉంటాయి.
తమ బలాలు, బలహీనతలు( Strengths ,weaknesses ) ఏమిటో ఆలోచించి, తమకు సరిపోయే భాగస్వామిని ఎంచుకోవాలని అనుకుంటారు.
అలాంటి లిస్టు ఉండటం సహజం.కానీ, ఒక మహిళ తన భర్త గురించి రాసిన లిస్ట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఆ లిస్ట్‌లోని క్వాలిటీస్ అంత గొప్పగా ఉన్నాయి మరి.ఆమె ఏమైనా పడుచు పిల్లా అంటే అదీ కాదు.విడాకులు తీసుకున్నది, కానీ నెలకు 1.32 లక్షలు సంపాదిస్తుంది.అయితే తన భర్త నెలకు 30 లక్షలు సంపాదించాలని ఆమె కోరుతోంది.ఇది నిజమే, మేము అబద్ధం చెప్పడం లేదు! .

ఆమె తన తల్లిదండ్రులతోనే ఉంటానని, పెళ్లి తర్వాత వారిని ఒంటరిగా వదిలి వెళ్లను అని చెప్పింది.తన భర్తకు 3 బెడ్‌రూమ్స్ ( 3 bedrooms )కలిగిన ఇల్లు ఉండాలని, తన తల్లిదండ్రులతో కలిసి తాను ఆ ఇంట్లో ఉండాలని కోరింది.కానీ, తన భర్త తల్లిదండ్రులతో మాత్రం ఆమె ఉండాలని కోరుకోవడం లేదు.తాను ఫుడ్ లవర్ అని, వరల్డ్ టూర్ వేయాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.పెళ్లి తర్వాత ప్రపంచం మొత్తం తిరగాలని కోరుకుంది.ఆమె పోస్టుపై చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.

ఒకరు “ఆమెకు విడాకులు అయినా, అన్‌మారీడ్ పర్సన్‌ను కోరుతోంది.మళ్లీ తన పేరెంట్స్‌ను తనతోనే ఉంచుకుంటుందట, కానీ అత్తమామలను మాత్రం తన్ని తరిమేస్తుందట చెప్పింది.ఆమె నెలకు రూ.11,000 రూపాయలు సంపాదిస్తుంది, ఇది నగరంలో ఒక ఇంటి పనివారి జీతానికి సమానం.కానీ ఆమె భర్త చాలా బాగా సంపాదించాలని కోరుతోంది.” అని కామెంట్ చేశారు.