కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.దీంతో ఉప ఎన్నికలో విజయం సాధించాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.
ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నియోజకవర్గంలోని సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లను కొంటున్నారని ఆరోపించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరూ పార్టీ మారొద్దని కోరారు.ఒక్క ఏడాది ఓపిక పడితే కాంగ్రెస్ దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.
ఉప ఎన్నిక సందర్భంగా ఈనెల 20 నుంచి మునుగోడులో ఉంటానని తెలిపారు.