ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి( CM Jagan Mohan Reddy ) రాయలసీమ జిల్లాలు కంచుకోట అనే సంగతి తెలిసిందే.2014 ఎన్నికల్లో అయినా 2019 ఎన్నికల్లో అయినా రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి.అయితే ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో( Coastal Districts ) సైతం జగన్ కు ఊహించని స్థాయిలో ప్రజాదరణ దక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.కోస్తా జిల్లాల్లో వైసీపీకి అనుకూలంగా లెక్క మారుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
సీఎం జగన్ పై కొన్నిరోజుల క్రితం జరిగిన రాయిదాడి కుట్రపూరితంగానే జరిగిందనే సంగతి తెలిసిందే.ఈ దాడి కేసులో ప్రముఖ టీడీపీ నేత పేరు వినిపిస్తుండగా ఆయన అనుచరుడు దుర్గారావును( Durga Rao ) పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
పోలీసులు జగన్ పై కుట్ర వెనుక ఉన్నది టీడీపీ కార్యకర్తలు, నేతలే అని ప్రూవ్ చేస్తే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లేనని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
టీడీపీ ఆశలు పెట్టుకున్న జిల్లాల్లోనే జగన్ కు ఊహించని స్థాయిలో ప్రజాదరణ దక్కుతుండటంతో ఆ పార్టీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.జగన్ పై జరిగిన దాడి విషయంలో రాబోయే రోజుల్లో మరి కొందరు నేతల పేర్లు కూడా వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.350 రూపాయల కోసం సతీష్ దాడి చేశాడంటూ లోకేశ్( Lokesh ) చేసిన ట్వీట్ కూడా టీడీపీకే రివర్స్ లో మైనస్ అయిందని చెప్పవచ్చు.
ఎన్నికల ముందు ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.జగన్ ప్రకటించే వరకు తుది మేనిఫెస్టోను ప్రకటించలేని దుస్థితిలో కూటమి ఉంది.పిఠాపురంలో పవన్ కు( Pawan Kalyan ) సైతం గెలుపు సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తనకు ప్లస్ అవుతుందని అనుకున్న పొత్తే కూటమిని చిత్తు చేసే ఛాన్స్ ఉందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ పార్టీ ఎలా ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది.