కోస్తాలో జగన్ కు ఊహించని స్థాయిలో ప్రజాదరణ.. అక్కడ లెక్క మారుతోందా?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి( CM Jagan Mohan Reddy ) రాయలసీమ జిల్లాలు కంచుకోట అనే సంగతి తెలిసిందే.

2014 ఎన్నికల్లో అయినా 2019 ఎన్నికల్లో అయినా రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి.

అయితే ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో( Coastal Districts ) సైతం జగన్ కు ఊహించని స్థాయిలో ప్రజాదరణ దక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

కోస్తా జిల్లాల్లో వైసీపీకి అనుకూలంగా లెక్క మారుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.సీఎం జగన్ పై కొన్నిరోజుల క్రితం జరిగిన రాయిదాడి కుట్రపూరితంగానే జరిగిందనే సంగతి తెలిసిందే.

ఈ దాడి కేసులో ప్రముఖ టీడీపీ నేత పేరు వినిపిస్తుండగా ఆయన అనుచరుడు దుర్గారావును( Durga Rao ) పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

పోలీసులు జగన్ పై కుట్ర వెనుక ఉన్నది టీడీపీ కార్యకర్తలు, నేతలే అని ప్రూవ్ చేస్తే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లేనని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

"""/" / టీడీపీ ఆశలు పెట్టుకున్న జిల్లాల్లోనే జగన్ కు ఊహించని స్థాయిలో ప్రజాదరణ దక్కుతుండటంతో ఆ పార్టీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

జగన్ పై జరిగిన దాడి విషయంలో రాబోయే రోజుల్లో మరి కొందరు నేతల పేర్లు కూడా వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

350 రూపాయల కోసం సతీష్ దాడి చేశాడంటూ లోకేశ్( Lokesh ) చేసిన ట్వీట్ కూడా టీడీపీకే రివర్స్ లో మైనస్ అయిందని చెప్పవచ్చు.

"""/" / ఎన్నికల ముందు ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.జగన్ ప్రకటించే వరకు తుది మేనిఫెస్టోను ప్రకటించలేని దుస్థితిలో కూటమి ఉంది.

పిఠాపురంలో పవన్ కు( Pawan Kalyan ) సైతం గెలుపు సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తనకు ప్లస్ అవుతుందని అనుకున్న పొత్తే కూటమిని చిత్తు చేసే ఛాన్స్ ఉందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ పార్టీ ఎలా ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది.

15 కుక్కలను స్లిప్పర్‌తో బెదరగొట్టిన హైదరాబాదీ యువతి.. వీడియో వైరల్..