Shobha Shetty : బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న శోభా శెట్టి సడన్‌గా ఈటీవీ ప్రోగ్రామ్‌లో ప్రత్యక్షం.. అదెలా..

శోభాశెట్టి( Shobha shetty ) దాదాపు 11 వారాలుగా బిగ్‌బాస్ హౌజులోనే ఉంది.ఆమె ఒక్కసారి కూడా హౌస్ నుంచి బయటికి వెళ్ళలేదు.

 How Shobha Shetty Arrived In Etv-TeluguStop.com

కానీ తాజాగా ఈటీవీ లేటెస్ట్ ప్రోగ్రామ్‌ ప్రోమోలో కనిపించింది.దాంతో అందరూ అవాక్కవుతున్నారు.

ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ అయిన ఈటీవీ “ఆలీతో ఆల్ ఇన్ వన్( Alitho All in One )” పేరుతో ఒక రియాలిటీ షో రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇది పెద్దగా పాపులర్ అవలేదు కానీ అందులో శోభా శెట్టి పార్టిసిపేట్ చేసింది.

ఆమె పార్టిసిపేట్ చేసిన ఎపిసోడ్ నవంబర్ 21న ప్రసారం కానుంది.అయితే ఆ ఎపిసోడ్ అందరూ చూసేలా చేయడానికి ఈటీవీ ఒక ప్రోమో రిలీజ్ చేసి ప్రమోషన్ చేసుకుంటోంది.

ఈ ఎపిసోడ్ కి ఆమెతో పాటు మరో ఇద్దరు మేల్ సెలబ్రిటీలు కూడా వచ్చారు కానీ వారి కంటే శోభాను పాపులర్.అయితే ఇందులో కూడా బిగ్‌బాస్ తాలూకు టెంపరే శోభాశెట్టి చూపించింది.

Telugu Alitho, Bigg Boss, Indraneel, Promo, Shivaji, Shobha Shetty, Tollywood-Mo

అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న శోభా శెట్టి సడన్‌గా ఈటీవీ ప్రోగ్రామ్‌లో ఎలా ప్రత్యక్షం అయ్యింది? దాదాపు 80 రోజులుగా ఆమె హౌస్ లోనే ఉంది.బయటికి వచ్చే ఛాన్స్ లేదు.అలాంటప్పుడు ఈ రీసెంట్ ప్రోగ్రాం లో ఎలా పాల్గొంది? సీక్రెట్ గా హౌస్ నుంచి అడుగుపెట్టి ఈటీవీలో ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసిందా? అర్ధరాత్రి ఎవరి కంటపడకుండా బయటికి వెళ్లిందా ? లేదంటే బిగ్ బాస్ నిర్వాహకుల పర్మిషన్ తీసుకుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు సగటు బిగ్ బాస్ ప్రేక్షకుడిలో తలెత్తుతున్నాయి.

Telugu Alitho, Bigg Boss, Indraneel, Promo, Shivaji, Shobha Shetty, Tollywood-Mo

ఆ ప్రోమో చూస్తే చాలా రీసెంట్ గానే అనిపిస్తోంది.కాబట్టి ఈ డౌట్స్ రావడం కామన్.అయితే వాస్తవానికి ఈటీవీ చాలా రోజుల క్రితం షూట్ చేసిన ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేస్తుంటుంది.

అదే పద్ధతిలో శోభా శెట్టి( Shobha Shetty ) ఎపిసోడ్ కూడా నవంబర్ 21న తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.ఏదేమైనా శోభా శెట్టి ఫ్యాన్స్ కి ఈ ఎపిసోడ్ చాలా స్పెషల్‌గా మారుతుంది.

శివాజీ( Shivaji ) లాంటి కమింగ్ ఫెలోకి చుక్కలు చూపిస్తున్న శోభాశెట్టి ఈ వారం నామినేషన్స్ లో ఉంది.అనఫిషియల్ ఓటింగ్స్‌ ప్రకారం లిస్ట్ ప్లేస్ లో ఉంది కానీ బిగ్ బాస్ డేరింగ్ డాషింగ్ క్యాండిడేట్ అయిన శోభా శెట్టిని పంపించడం లేదు.

ఈ వారం కూడా పంపించకపోతే ఆమె టాప్ 5 లో నిలవడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube