అమరావతి రైతులపై రాజమండ్రిలో చెప్పులు, బాటిళ్లతో జరిగిన దాడిని భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు డీజీపీని ప్రశ్నించారు.ఓ ఎంపీ ప్రోద్బలంతోనే దాడి జరిగిందని ఆరోపించిన ఆయన.
వైసీపీ ఎంపీ భరత్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.అమరావతి రైతులకు రక్షణ కల్పించాలన్న హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పుడు కూడా, సాక్షాత్తు ఎంపీ ఆధ్వర్యంలోనే దాడి జరిగితే సామాన్యులకు ఏ విధమైన రక్షణ ఉంటుందని ప్రశ్నించారు.
తక్షణమే ఎంపీ భరత్, అతడి గూండాలపై హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.మొన్న విశాఖ ఎయిర్ పోర్టు వద్ద నిరసన తెలిపిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టారు… నేడు దాడి జరిగినా కేసులుండవా? అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ నేతలను, కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేసే మీరు వీళ్లను అక్కడికి ఎలా రానిచ్చారు? అంటూ పోలీసులను నిలదీశారు.