రాంగ్ ఇంజక్షన్ ఇచ్చారు.. చనిపోయిందని తెలిసి బయట పడేసారు.. వీడియో చూస్తే షాకే..!

డాక్టర్ల నిర్లక్ష్యానికి, అసహనానికి అన్యాయంగా 17 ఏళ్ల బాలిక బలైయింది.ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం,( Uttar Pradesh ) మెయిన్‌పురి సిటీలో చోటు చేసుకుంది.

 Hospital Staff Gives Wrong Injection To Patient Dumps Body And Flees In Uttar Pr-TeluguStop.com

ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తప్పు ఇంజెక్షన్( Wrong Injection ) ఇవ్వడంతో సదరు బాలిక మరణించింది.ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి వెలుపల మోటార్‌సైకిల్‌పై పడేసి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పారిపోయారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఆ వీడియోలో మోటార్‌సైకిల్‌పై భారతి మృతదేహం పడి ఉన్నట్లు మీరు చూడొచ్చు.

v

వివరాల్లోకి వెళితే, భారతి( Bharti ) అనే బాలిక జ్వరంతో మంగళవారం రాధాస్వామి ఆసుపత్రిలో( Radha Swami Hospital ) చేరింది.బుధవారం భారతి ఆరోగ్యం బాగానే ఉందని ఆమె అత్త మనీషా తెలిపింది.

అయితే, ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె పరిస్థితి మరింత విషమించిందని, దీంతో వైద్యులు భారతిని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారని ఆమె వెల్లడించింది.కానీ భారతి అప్పటికే చనిపోయిందని మనీషా తెలిపింది.

ప్రజలు దేహాశుద్ధి చేస్తారన్న భయంతో ఆసుపత్రి సిబ్బంది అక్కడినుంచి పారిపోయింది.అయితే తమ కుమార్తెకు న్యాయం చేయాలని భారతి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

వైద్య లేదా అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఎవరూ లేరని దర్యాప్తులో తేలిన తర్వాత ఆసుపత్రిని మూసివేయాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆదేశించారు.సరైన చికిత్స అందించకపోవడంతో భారతి పరిస్థితి విషమంగా మారిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.ఆసుపత్రి రిజిస్టర్ అయింది, కానీ ఆపరేటర్ డాక్టర్ కాదు, కాబట్టి అతని లైసెన్స్ రద్దు చేశారు.భారతిని సకాలంలో వేరే ఆసుపత్రికి తరలించి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవి కానీ, సిబ్బంది బాలిక విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

పైగా బయటే వదిలేసి అందరిలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వారంలోగా నివేదిక సమర్పించాలని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంవో), అదనపు సీఎంఓలను ప్రభుత్వం ఆదేశించింది.ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి( UP Health Minister ) తెలిపారు.ఇలాంటి ఘటనలను సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube