యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమా రూపొందుతోంది.ఇప్పటికే పూర్తి అయిన సలార్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.
మరో వైపు మారుతి దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతోంది.ఆ తర్వాత సలార్ 2 కూడా రాబోతుంది.
మొత్తానికి ప్రభాస్ చేతి నిండా సినిమా లు ఉన్నాయి.ఇదే సమయంలో ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ ను( Spirit ) ప్రకటించి రెండేళ్లు అవుతోంది.
ఇప్పటి వరకు షూటింగ్ ను మొదలు పెట్టలేదు.అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో స్పిరిట్ సినిమా రూపొందబోతుంది.
పాన్ వరల్డ్ మూవీగా ఆ సినిమా ను రూపొందించబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) బాలీవుడ్ లో యానిమల్ అనే సినిమా ను రూపొందించి ఆ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
భారీ అంచనాల నడుమ రూపొందిన యానిమల్ సినిమా లో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నటించగా రష్మిక మందన్నా( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ కాంబో పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటే పర్వాలేదు.ఫలితం తారు మారు అయితే ప్రభాస్ తో సందీప్ వంగ చేయాలి అనుకున్న సినిమా పరిస్థితి ఏంటి.
ఎప్పటికి ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి స్పిరిట్ సినిమా పై ఫుల్ క్లారిటీ రావాలి అంటే యానిమల్ సినిమా( Animal Movie ) విషయం లో ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ రెండు సినిమాల గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.యానిమల్ సినిమా పై దర్శకుడు చాలా నమ్మకంతో ఉన్నాడు.కనుక స్పిరిట్ సినిమా కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనేది కొందరి టాక్.కచ్చితంగా స్పిరిట్ ను 2025 లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.







