స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్( Guppedantha Manasu ) లో హీరో తల్లి పాత్రలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి జ్యోతి రాయ్( Jyothi Rai ) .ఈ సీరియల్ లో జగతి పాత్రలో ఒక లెక్చరర్ గా ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా స్టైలిష్ లుక్ లో ఉండడమే కాకుండా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు.
ఇలా ఈమె సోషల్ మీడియా కనుక చూస్తే అసలు జగతి మేడమే నా ఇక్కడ అని సందేహాలు వ్యక్తం చేయక మానరు అంతలా రచ్చ చేస్తున్నారు.
ఇలా ఈమె నటిగా ఇప్పటికీ ఎన్నో సీరియల్స్ అలాగే సినిమాలలో నటించారు.ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈమె వృత్తిపరమైన జీవితం పక్కన పెట్టి వ్యక్తిగత జీవితానికి వస్తే.20 సంవత్సరాల వయసులోనే ఒక వ్యక్తిని వివాహం చేసుకొని కొడుకుకు జన్మనిచ్చినటువంటి ఈమె కొన్ని విభేదాల కారణంగా భర్త నుంచి విడిపోయారు.దీంతో ఒక యంగ్ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నారు.
సోషల్ మీడియా వేదికగా ఆయనతో ఎంతో చనువుగా ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.అయితే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ బంధం శాశ్వతం కాబోతుందని తెలుస్తుంది.
తరచూ తన ప్రియుడు సుఖ పూర్వజ్ ( Sukh Purvaj ) తో కలిసి ఉండే ఫోటోలను షేర్ చేసే జ్యోతి తాజాగా తన ప్రియుడుతో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ కింద క్యాప్షన్ గా ఒక రింగ్ ఎమోజిని షేర్ చేశారు.దీంతో వీరిద్దరూ నిశ్చితార్థం ( Engagment ) చేసుకున్నారా లేకపోతే త్వరలోనే చేసుకోబోతున్నారా అన్న విషయం తెలియకపోయినప్పటికీ వీరి బంధం మాత్రం శాశ్వతం కాబోతుందని తెలుస్తుంది.ఇలా ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి ( Marriage ) కూడా చేసుకోబోతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది మరి ఈమె పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలు మాత్రం తెలియాల్సింది అయితే వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి అని తెలుస్తుంది.ఏది ఏమైనా సీరియల్లో ఎంతో పద్ధతిగా కనిపించే ఈమెను ఇలా చూసేసరికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి.