సుశాంత్ సింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి పై మీడియా సంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎందుకు మీడియాను నియంత్రించటం లేదని ప్రభుత్వం పై సీరియస్ అయ్యింది.
రియా చక్రవర్తి ఇంటి నుండి బయటకు వచ్చిన లేదా ఆమె గురించి చిన్న సమాచారం తెలిసిన మీడియా బ్రేకింగ్ న్యూస్ లు నాన్ స్టాప్ గా వేస్తూ న్యూస్ అంతా ఆమె చుట్టూ తిప్పడం పై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
రియా కేసు వ్యవహారంలో మీడియా చూపిస్తున్న చొరవను నియంత్రించని ప్రభుత్వ తీరుపై బాంబే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
అలాగే సెన్సిటివ్ సమాచారం మీడియా చేతికి ఎలా చిక్కిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విషయానికి వస్తే రోజుకొక ఆసక్తికర అంశం బయటికి వస్తుంది.
సుశాంత్ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముంబై పోలీసులను ప్రశ్నించిన కంగనాకు కు చెందిన బిల్డింగ్స్ ను అక్కడి ప్రభుత్వం కూల్చింది.ఇలా అర్థరహితంగా వ్యవహరిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వ ధోరణి పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.