అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు ఊరటనిచ్చిన హైకోర్టు.. !

ఏపీలో అమరావతి భూ వివాదం ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.

 High Court Stays Chandrababu In Amaravati Assigned Land Case, Amaravati, Assigne-TeluguStop.com

అయితే ఇది వరకే చంద్రబాబు, నారాయణ సీఐడీ తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కాగా ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తదుపరి చర్యలను నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ అప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

ఇక మరోసారి జరిగిన ఈ కేసు విచారణలో ఈ ఉత్తర్వులను మరో మూడు వారాల పాటు పొడిగించింది.ఈమేరకు తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.

దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube