వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.పాదయాత్రకు నర్సంపేట పోలీసులు అనుమతి రద్దు చేయడంతో వైఎస్ఆర్ టీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిల్ ను విచారించిన న్యాయస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.అయితే సీఎం కేసీఆర్, రాజకీయ, మత పరమైన అంశాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని న్యాయస్థానం పేర్కొంది.
మరోవైపు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పీఎస్ కు తరలించిన సంగతి తెలిసిందే.పాదయాత్రలో టీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడికి నిరసనగా ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.