మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తన టాలెంట్ తో ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా హీరోగా గుర్తింపు పొందిన ఈయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.
ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇక రామ్ చరణ్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం ఈయనకు సోషల్ మీడియాలో 20 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో రామ్ చరణ్ ఏకంగా 10 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం విశేషం.
ఇలా సోషల్ మీడియాలో 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుని ప్రభాస్ మహేష్ బాబు వంటి హీరోలను కూడా బీట్ చేశారు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇంస్టాగ్రామ్ లో తొమ్మిది మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండగా పాన్ ఇండియా స్థాయిలో ఇంకా సినిమాలలో నటించని మహేష్ బాబుకి 9.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇక ఇద్దరి స్టార్ హీరోలను బీట్ చేస్తూ రాంచరణ్ 10 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు.సోషల్ మీడియాలో 20 మిలియన్ల ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉండగా 17 మిలియన్ల ఫాలోవర్స్ తో విజయ్ దేవరకొండ తర్వాత స్థానంలో ఉన్నారు.ఇక రామ్ చరణ్ 10 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకోవడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.