తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు.ఇలా ఈ సినిమాతో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనంతరం వరుస సినిమాలకు దర్శకత్వం వహించే అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు పొందారు.
ఇకపోతే ఈయన మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఆచార్య సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ విధంగా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో కొరటాల కెరియర్లో మొదటిసారిగా ఫ్లాప్ సినిమా పడిందని చెప్పాలి.అయితే ఈ సినిమా డిజాస్టర్ గురించి ఎన్నో సార్లు చిరంజీవి ప్రస్తావిస్తూ తాము డైరెక్టర్ చెప్పిన విధంగానే చేసామని ఈ సినిమా ఫెయిల్యూర్ మొత్తం కొరటాల శివ ఖాతాలోకి వేశారు.
దీంతో అప్పట్లో ఈ విషయం గురించి పలు చర్చలు కూడా మొదలయ్యాయి.ఇకపోతే ఈ సినిమా అపజయం గురించి తాజాగా మణిశర్మ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మణిశర్మ ఆచార్య సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.మెగాస్టార్ చిరంజీవికి ఏ తరహా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వాలో తనకు బాగా తెలుసని అందుకే తాను ఆచార్య సినిమాకి కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనుకున్నాను.అయితే తాను తన అనుకున్నది కాకుండా డైరెక్టర్ గారు చెప్పినది చేయాల్సి వచ్చిందని తెలిపారు.తాను మొదట అనుకున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి మరింత ప్లస్ పాయింట్ అయ్యేది అంటూ ఈ సందర్భంగా మణిశర్మ చెప్పడంతో ఈయన కూడా పరోక్షంగా ఆచార్య సినిమా ఫ్లాప్ కొరటాలదే అని చెప్పకనే చెప్పేశారనీ తెలుస్తోంది.
ప్రస్తుతం ఆచార్య గురించి మణిశర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.