నాని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే ఈసారి సక్సెస్ దక్కడానికి చాలా సమయం పట్టింది.
నాని చివరగా విజయాన్ని సొంతం చేసుకుని చాలా ఏళ్లు అవుతుంది అనడంలో సందేహం లేదు.ఆయన నుంచి వచ్చిన సినిమాలు సో సో గా ఉండటంతో పాటు ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే దక్కించుకుంటూ వచ్చాయి.
కానీ కమర్షియల్ గ ఆ విజయాన్ని సొంతం చేసుకుని చాలా కాలం అయింది.ఎట్టకేలకు హాయ్ నాన్న సినిమా తో కమర్షియల్ గా విజయాన్ని సొంతం చేసుకున్న నాని జోష్ మీద కనిపిస్తున్నాడు.
హాయ్ నాన్న సినిమా లో సెంటిమెంట్ తో నాన్న గా నాని మెప్పించాడు.గతంలో కూడా జెర్సీ మరియు కొన్ని సినిమా ల్లో నాని కన్నీళ్లు పెట్టుకుని అందరి దృష్టి ఆకర్షించి.
హిట్ కొట్టాడు.ఇప్పుడు ఈ సినిమా కూడా అదే విధంగా ఉంది అనడంలో సందేహం లేదు.
కన్నీళ్లు పెట్టించి, కొన్ని సన్నివేశాల్లో గుండెను పిండేసి మరీ నాని హిట్ కొట్టాడు.
నాని దసరా వంటి యాక్షన్ మాస్ సినిమా లో నటించడం కంటే హాయ్ నాన్న వంటి క్లాస్ అండ్ సెంటిమెంట్ సినిమా లో నటిస్తే ఎక్కువ మంది చూస్తారు అని దీంతో మళ్లీ నిరూపితం అయింది.హాయ్ నాన్న కంటెంట్ గొప్ప కంటెంట్ ఏమీ కాదు.కథ విషయం లో కూడా కొత్తదనం ఏమీ లేదు.
అయినా కూడా జనాలు బ్రహ్మరథం పడుతున్నారు అంటే నాన్న మరియు పాప మధ్య ఉండే సెంటిమెంట్ సన్నివేశాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అందుకే నాని సెంటిమెంట్ సన్నివేశాలకు ఎప్పుడు కూడా మంచి ఆధరణ దక్కుతుంది అంటూ సినీ విశ్లేషకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
అందుకే నాని ముందు ముందు కూడా మంచి సెంటిమెంట్ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.