యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమా క్రిస్మస్ కానుకగా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సలార్ రావడానికి ఇంకా 12 రోజుల సమయం ఉంది.
ఈ లోపు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద సినిమాల హడావుడి లేదు.దాంతో గత వారం విడుదల అయిన హాయ్ నాన్న జోరు కంటిన్యూ అవుతోంది.
విడుదల రోజు కాస్త డల్ గా అనిపించినా కూడా రెండో రోజు మూడో రోజు నుంచి సందడి పెరిగింది.భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతున్నాయి.
ఇప్పటికే ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ ని చేరుకోబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.ఇక హాయ్ నాన్న సినిమా తెలుగు రాష్ట్రాల వసూళ్లు కూడా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ రేంజ్ లో వసూళ్లు ఉంటాయని ఊహించలేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

నాని మరియు మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా కి మొదటి నుంచి కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా నాని ప్రమోషన్స్ చేశాడు.చాలా కాలం నుంచి సినిమా గురించి మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది.దానికి తోడు విడుదల తర్వాత సినిమాకు మౌత్ పబ్లిసిటీ దక్కింది.
అందుకే సినిమా కు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.30 కోట్లు.ఇప్పుడు ఆ మొత్తం ఈజీగా రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే సగానికి పైగా రికవరీ అయ్యి ఉంటుంది.వచ్చే వీకెండ్ కి కచ్చితంగా సినిమా అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
మొత్తానికి నాని చాలా కాలం తర్వాత ఓ సాలిడ్ కమర్షియల్ హిట్ ను దక్కించుకున్నాడు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.