Heros Look: ప్రతి సినిమాలో గడ్డం, జుట్టుతో కనిపించేందుకు పోటీ పడుతున్న హీరోలు !

సినిమా సినిమాకి గెటప్ చేంజ్ చేయాలి అనేది పాత మాట.ఎలా ఉన్నా సరే తమను గెటప్ తో కాకుండా కంటెంట్ తో యాక్సెప్ట్ చేయాలనేది ఇప్పటి మాట.

 Heros With Long Beard And Hair Ntr Dhanush Suriya Ranbir Allu Arjun-TeluguStop.com

అందుకే ఈ మధ్యకాలంలో హీరోలంతా కూడా గడ్డం మెయింటైన్ చేయడం కామన్ గా మారిపోయింది అలాగే కాస్త లాంగ్ హెయిర్ ఉంచుకోవడం కూడా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.మరి అలా లాంగ్ హెయిర్ తో గడ్డంతో సందడి చేస్తున్న హీరోలు ఎవరో ఆ సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జూనియర్ ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్( NTR ) కాస్త గడ్డంతో జుట్టుతో కనిపించి ఈ సందడి చేశాడు ఆ తర్వాత దేవర సినిమా( Devara ) ఫస్ట్ పోస్టర్ లో కూడా జూనియర్ తనదైన హెయిర్ స్టైల్ తో థిక్ గడ్డంతో కనిపించి ఔరా అనిపించాడు ఇప్పుడు ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి వచ్చిన తారక్ ని చూసి అందరూ మళ్లీ హెయిర్ స్టైల్ మార్చేసాడు ఏంటి అనుకున్నారు.మరి దేవరా షూటింగ్ కోసం జుట్టు పెంచాడా లేదా అనేది ప్రస్తుతం అందరికీ డౌట్ గా ఉంది.

Telugu Allu Arjun, Animal, Miller, Devara, Dhanush, Heros, Ntr, Kanguva, Pushpa,

సూర్య

మామూలుగా ప్రయోగాలు చేయడం అంటే సూర్యకి( Suriya ) చాలా ఇష్టం.ఇప్పుడు తన బాడీ లాంగ్వేజ్ లోనే కాదు జుట్టుతో కూడా ప్రయోగాలు చేస్తున్నాడు.ప్రస్తుతం సెట్ పైన ఉన్న కంగువా సినిమా లో( Kanguva ) ఇప్పటి వరకు లేనటువంటి విభిన్నమైన లుక్ లో సూర్య కనిపించబోతున్నారట.30కి పైగా భాషల్లో విడుదలవుతున్నాయి ఈ సినిమా సూర్యకి లుక్ పరంగా చాలా మెమొరబుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

Telugu Allu Arjun, Animal, Miller, Devara, Dhanush, Heros, Ntr, Kanguva, Pushpa,

అల్లు అర్జున్

సినిమా అంటే ఎంత కష్టమైనా సరే అనుభవించాలి అని అనుకునే హీరోలలో అల్లు అర్జున్( Allu Arjun ) మొదటి వరుసలో ఉంటాడు.అందుకే పుష్ప సినిమా( Pushpa ) కోసం తన గెటప్ అలాగే ఆహార్యంలో ఎంతో మార్పులు కనిపించే విధంగా జాగ్రత్త పడ్డాడు.అవి ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి అని చెప్పుకోవాలి.మరో మారు పుష్ప సీక్వెల్ తో కూడా అల్లు అర్జున్ ప్రేక్షకుల మనసును దోచుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu Allu Arjun, Animal, Miller, Devara, Dhanush, Heros, Ntr, Kanguva, Pushpa,

రణబీర్ కపూర్

అనిమల్( Animal Movie ) ద్వారా రన్బీర్ కపూర్( Ranbir Kapoor ) డిసెంబర్ మొదటి వారంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలో పూర్తి స్థాయి గడ్డంలో పొడవాటి జుట్టులో రన్బీర్ అందరి దృష్టిని ఆకర్షించాడు నిజానికి ఈ చిత్రం అని అంటున్నారు ఇప్పటివరకు రన్బీర్ కెరియర్ లో అత్యంత హైయెస్ట్ గ్రాస్ కూడా ఈ చిత్రం కలెక్ట్ చేస్తుందని అంటున్నారు ఈ సినిమాలో అతని లుక్ చాలా చాలా బాగుంటుంది.

Telugu Allu Arjun, Animal, Miller, Devara, Dhanush, Heros, Ntr, Kanguva, Pushpa,

ధనుష్

ధనుష్( Dhanush ) తన తాజా చిత్రం సార్ లో గడ్డంతో కనిపించి అలరించాడు ఈ సినిమా తర్వాత ఆ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్( Captain Miller ) అనే మరో సినిమాలో నటిస్తున్నాడు అయితే ఈ సినిమాలో ఇప్పటివరకు లేనివిధంగా పొడవాటి గడ్డంతో అలాగే జుట్టుతో సందడి చేయబోతున్నాడు.ఈ లుక్ నేవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంటుందని ఈ ధనుష్ అభిమానులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube