టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన సౌందర్యకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.గ్లామరస్ రోల్స్ లో నటించకుండానే 100 కంటే ఎక్కువ సినిమాలలో నటించిన సౌందర్య ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.
ఈతరం ప్రేక్షకుల్లో కూడా సౌందర్యను అభిమానించే అభిమానులు చాలామంది ఉన్నారు.తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించిన సౌందర్య అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఓటేయడం గమనార్హం.
2004 సంవత్సరంలో విమాన ప్రమాదంలో సౌందర్య మరణించగా ఆ వార్త విన్న అభిమానులు షాక్ కు గురయ్యారు.సౌందర్య అసలు పేరు సౌమ్య అనే సంగతి తెలిసిందే.12 సంవత్సరాల పాటు వరుస సినిమా ఆఫర్లతో సౌందర్య నటిగా ఒక వెలుగు వెలిగారనే చెప్పాలి.వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ లో తెరకెక్కిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
చాలామంది ఫ్యాన్స్ సౌందర్యను తెలుగింటి ఆడపడుచు అని భావిస్తారు.
అయితే సౌందర్య చనిపోవడం స్నేహ కెరీర్ కు ప్లస్ అయిందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
సౌందర్య మరణం తర్వాతే స్నేహకు సినిమా ఆఫర్లు పెరిగాయనే సంగతి తెలిసిందే.అయితే ఒక సందర్భంలో స్నేహకు ఇదే ప్రశ్న ఎదురు కాగా ఆ ప్రశ్న గురించి స్నేహ స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సౌందర్యకు తాను వీరాభిమానినని సౌందర్య చనిపోవడం తనకు ఎంతో బాధను కలిగించిందని ఆమె వెల్లడించారు.
సౌందర్య చనిపోయిన సమయంలో తాను మూవీ షూటింగ్ లో పాల్గొన్నానని చిన్న వయస్సులోనే సౌందర్య చనిపోవడం బాధాకరం అని ఆమె చెప్పుకొచ్చారు.సౌందర్యపై తనకు ఉండే అభిమానాన్ని స్నేహ ఈ విధంగా వెల్లడించారు.సౌందర్య బాటలోనే నడిచిన స్నేహ కొన్నేళ్ల పాటు వరుస సినిమాలలో నటించగా ఈ మధ్య కాలంలో ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే.