సినిమాలకు కొన్నేళ్ల పాటు గ్యాప్ ఇచ్చినా హీరోయిన్ శృతిహాసన్ కు సినిమా ఆఫర్లు మాత్రం అస్సలు తగ్గడం లేదనే సంగతి తెలిసిందే.పాన్ ఇండియా సినిమాలలో సైతం శృతిహాసన్ కు ఆఫర్లు వస్తుండటం గమనార్హం.
ప్రస్తుతం శృతిహాసన్ సలార్ మూవీలో నటిస్తుండగా ప్రభాస్, శృతి కలిసి నటిస్తున్న తొలి సినిమా సలార్ కావడం గమనార్హం.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే శృతి హాసన్ కు సినిమా ఆఫర్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.
రవితేజ సరసన శృతి నటించిన క్రాక్ సినిమా సక్సెస్ కావడంతో పాటు ఆ సినిమాలో శృతి అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే.తాజాగా సోషల్ మీడియాలో శృతిహాసన్ మీసాలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
శృతిహాసన్ తన జుట్టును మీసంలా ఉంచుకోవడం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు వకీల్ సాబ్ సినిమాలో సైతం శృతి హాసన్ అతిథి పాత్ర చేశారు.అయితే శృతి హాసన్ చేసిన అతిథి పాత్రపై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ కామెంట్ల కంటే నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వచ్చాయి.వకీల్ సాబ్ సక్సెస్ సాధించినా శృతికి ఆ సినిమా ఏ మాత్రం ప్లస్ కాలేదు.మరోవైపు శృతి హాసన్ సీనియర్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తున్నా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
యంగ్ హీరోలకు మాత్రమే శృతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుండటం గమనార్హం.సలార్ సినిమాలో శృతిహాసన్ ఫైట్లు చేస్తుందని ప్రచారం జరుగుతున్నా గతంలో శృతిహాసన్ సలార్ సినిమాలో తాను ఎలాంటి ఫైట్లు చేయడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.అందువల్ల ఈ వార్తలో నిజం లేదని అర్థమవుతోంది.