చాలా రోజులుగా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమాలో నటించి విజయం సాధించాలని ఎదురు చూస్తున్న గోపి చంద్ కి ఒక డీసెంట్ హిట్ పడినట్టుగానే కనిపిస్తుంది.రామబాణం( Ramabanam ) శుక్రవారం రోజు థియేటర్స్ లో విడుదల అయ్యి పర్వాలేదు అనిపించుకుంటుంది.
తనకు ఇప్పటికే రెండు సార్లు విజయాలను ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం లో గోపీచంద్ హీరోగా డింపుల్ హాయతి( Dimple Hayati ) హీరోయిన్ గా జగపతి బాబు మరియు ఖుష్బు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రామబాణం.చాలా మంది హీరోలకు భిన్నమైన నటుడిగా గోపి చంద్ కి మ్యాచో హీరో అనే పేరు ఉంది.
అయితే యాక్షన్, ఫైట్ వంటి హంగులతో వస్తున్న సినిమాలు ఈ మధ్య బాగా బోర్ కొట్టిస్తుంటే, మంచి ఫ్యామిలీ ఎంట్టైనర్ గా రామబాణం నిలుస్తుంది.

మొదటి నుంచి గోపి చంద్( Gopichand ) మరియు శ్రీవాస్ కంబో పై అభిమానుల్లో మంచి గుర్తింపు ఉంది.ఇప్పటికే వీరిద్దరితో లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలు రావడం వల్ల ఈ మూడో ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.అభిమానులతో పాటు గోపి చంద్ పెట్టుకున్న నమ్మకాన్ని డైరెక్టర్ శ్రీవాస్ ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా మంచి సినిమా తీసి డీసెంట్ హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
అయితే ఏ దర్శకుడు అయినా కథ సిద్దం చేసుకున్నప్పుడు తన కథకు తగ్గ హీరో ఎవరో కూడా ఒక అంచనాకు వస్తారు.అలాగే శ్రీవాస్ సైతం రామబాణం కథ రెడీ చేసుకున్నాక తన సినిమాకు ఒడ్డు, పొడవు బాగా ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్( Mega Hero Varun tej ) అయితే బాగుంటుంది అని అనుకున్నాడట.

అనుకున్నట్టుగానే కథ మొత్తం కూడా వరుణ్ తేజ్ కి వినిపించాడట.కానీ ఇంత ఫ్యామిలీ డ్రామా( Family Drama ) తో పాటు ఎమోషన్ తనకు అస్సలు సూట్ కావని ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు వరుణ్ తేజ్.అంత హైట్ ఉన్న హీరో ఈ సినిమాకు బాగుంటాడు అనుకుంటే నో చెప్పడంతో తో అలాంటి పర్సనాలిటీ ఉన్న హీరో నే కావాలని శ్రీవాస్( Srivaas ) చాలా ట్రై చేయగా, తనకు బాగా అచ్చొచ్చిన గోపి చంద్ మాత్రమే కరెక్ట్ అనిపించి అతడిని పెట్టి సినిమా తీశాడు.సినిమాలో కొన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా కుటుంబం మొత్తం కూర్చొని సరదాగా ఎంజాయ్ చేయగలిగే సినిమా గా మాత్రం రామబాణం ఉంటుంది.