మాస్ మహారాజా రవితేజ( Raviteja ) కెరీర్ ఖతం అయింది, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేసుకోవాల్సిందే అనుకుంటూ ఉండగా క్రాక్ సినిమా తో( Krack Movie ) మంచి విజయంను సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత ఫ్లాప్ లు పడ్డా కూడా ధమాకా సినిమా తో( Dhamaka ) మళ్లీ తన సత్తా చాటాడు.
ఇలా ఫ్లాప్స్ పడ్డా కూడా అప్పుడప్పుడు విజయాలను సొంతం చేసుకుంటూ ఉన్న కారణంగా మినిమం గ్యారెంటీ హీరో అన్నట్లుగా రవితేజ కు మళ్లీ పేరు దక్కింది.తాజాగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
కానీ వసూళ్ల విషయం లో మాత్రం నిరాశ మిగిల్చింది.

వంద కోట్ల వసూళ్లు రాబట్టగల సత్తా ఉన్న సినిమా అంటూ మేకర్స్ ప్రకటించారు.కానీ వసూళ్లు అందులో సగం మాత్రమే వచ్చాయి.అయితే పెట్టిన పెట్టుబడికి తగ్గట్లుగా వసూళ్లు నమోదు అయ్యాయి.
అందుకే ఆయన తో సినిమాలకు నిర్మాతలు మరియు దర్శకులు క్యూ కడుతున్నారు అనడంలో సందేహం లేదు.తన వద్దకు వస్తున్న మంచి కథలను మిస్ చేసుకోకుండా రవితేజ దుమ్ము లేపుతున్నాడు.
తాజాగా జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్( Director Anudeep ) కూడా రవితేజ ను కలవడం, కథ చెప్పడం జరిగిందట.

అనుదీప్ చెప్పిన పాయింట్ నచ్చడం తో వెంటనే ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది.వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ను పట్టాలెక్కించేందుకు అనుదీప్ రెడీ అవుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.అసలు విషయం ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మరో వైపు అనుదీప్ జాతిరత్నాలు తర్వాత రూపొందించిన ప్రిన్స్ మూవీ నిరాశ పరిచింది.శివ కార్తికేయన్ కి తెలుగు లో మంచి ఎంట్రీ అనుకుంటే ఫ్లాప్ అవ్వడం తో ఇప్పుడు రవితేజ సినిమా ను అనుదీప్ ఎలా తీస్తాడు, దాన్ని జనాలు ఏ విధంగా స్వీకరిస్తారు అంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
మరి జాతిరత్నాలు ( Jathi Ratnalu ) రేంజ్ లో రవితేజ తో సినిమా ను అనుదీప్ తీసేనా చూడాలి.