మా నాని నటించిన హాయ్ నాన్న సినిమా ( Hi Nanna )సూపర్ హిట్ అవ్వబోతుంది అంటూ నాని ఫ్యాన్స్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.మరో వైపు నాని( Nani ) కూడా ఈ సినిమా కచ్చితంగా మీ అందరిని అలరిస్తుంది అంటూ ప్రామీస్ చేసి మరీ చెబుతున్నాడు.
ఈ మధ్య కాలంలో నాని ఇంత కాన్ఫిడెన్స్ గా కనిపించడం ఎప్పుడూ చూడలేదు అంటూ అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాని ఈ సినిమా కోసం చాలా ఎమోషనల్ సన్నివేశాలు చేశాడు.తాజాగా విడుదల అయిన ట్రైలర్ ను చూస్తూ ఉంటే సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది అనిపిస్తోంది.నాని గతంలో చేసిన సెంటిమెంట్ సినిమాలు, కన్నీళ్లు పెట్టుకుని నటించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఎంసీఏ, జర్సీ తో పాటు ఇంకా పలు సినిమా ల్లో నాని కన్నీళ్లు పెట్టుకుని, ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకునే విధంగా నటించాడు.ఆ సినిమా ల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ అభిమానులతో పాటు మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సెంటిమెంట్ వర్కౌట్ అయితే నాని కి హాయ్ నాన్న ఒక బిగ్ కమర్షియల్ మూవీ గా నిలువబోతుంది.కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా అన్ని భాష ల్లో కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వబోతున్న నేపథ్యం లో అంచనాలు భారీగా ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur )హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో కీలక పాత్ర లో శృతి హాసన్ ( Shruti Haasan )కనిపించబోతుంది.
సినిమా డిసెంబర్ 7న విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే.నాని సినిమా సెంటిమెంట్ తో ఆడటం చాలా సార్లు జరిగింది.కనుక హాయ్ నాన్న విషయం లోనూ అదే జరగబోతుంది.