అక్కినేని అఖిల్ కెరియర్ లో మొదటి హిట్ కొట్టిన జోష్ లో ఉన్నాడు.అఖిల్ బ్యాచిలర్ తో హిట్ ఖాతా తెరిచాడు.
ఆ సినిమా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చింది.ఇక ఇప్పుడు అఖిల్ తన నెక్స్ట్ సినిమా ఫుల్ మాస్ మూవీగా వస్తున్నాడు.
ఏజెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఏజెంట్ సినిమా అఖిల్ కెరియర్ లో ది బెస్ట్ యాక్షన్ మూవీగా రాబోతుంది.
ఈ సినిమాలో అఖిల్ లుక్స్ అదిరిపోతాయని తెలుస్తుంది.
సినిమా కోసం అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని అంటున్నారు.లేటెస్ట్ గా అఖిల్ తన జిమ్ లుక్ రివీల్ చేశాడు.
కండలు తిరిగే దేహంతో అఖిల్ కొత్త లుక్ అదిరిపోయిందని చెప్పొచ్చు.ఈ ఫోటో చూసిన అక్కినేని ఫ్యాన్స్ కటౌట్ అదిరింది డ్యూడ్ అని కామెంట్స్ చేస్తున్నారు.
అక్కినేని ఫ్యాన్స్ కు ఈ సినిమా తప్పకుండా సూపర్ ట్రీట్ ఇచ్చేస్తుందని చెప్పుకుంటున్నారు.మరి అఖిల్ ఏజెంట్ అనుకున్న రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి.