బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్( Director Karan Johar ) దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ( Rocky Aur Rani Ki Prem Kahani ).ఈ సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.
అయితే, ఇందులోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.కాగా ఈ సినిమాలో సీనియర్ నటుడు ధర్మేంద్ర, షబానా అజ్మీ కీలకపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమా కథలో భాగంగా వీళ్లిద్దరూ లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించిన సంగతి కూడా తెలిసిందే.

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా మొన్నటి వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆ ఫోటోపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపించిన విషయం తెలిసింది.దీంతో 87 ఏళ్ల వయసులో ఇలాంటి సీన్స్‌లో ఎందుకంటూ నెట్టింట కొందరు ట్రోల్స్ కూడా చేశారు.
తాజాగా ఈ సన్నివేశాలపై ధర్మేంద్ర భార్య హేమమాలిని అందించారు.ఈ సందర్భంగా హేమమాలిని మాట్లాడుతూ.
నేను ఇంకా సినిమా చూడలేదు.ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతున్నందుకు సంతోషంగా ఉంది.
ధర్మేంద్ర విషయంలోనూ నేను ఎంతో ఆనందంగా ఉన్నాను.అతడు కెమెరా ముందు ఉండటానికి ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు.

సినిమాను ప్రేమిస్తాడు అని చెప్పుకొచ్చింది హేమమాలిని.ఇకపోతే ఈ సన్నివేశంలో నటించిన నటి షబానా అజ్మీ( Actress Shabana Azmi ) దీనిపై మాట్లాడుతూ.దృఢంగా ఉండే స్త్రీ జీవితంలో రొమాన్స్ ఉండకూడదా? ఈ సినిమా విడుదలైన నాటి నుంచి నాకు ఎన్నో ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయి.కరణ్ జోహర్ ఎంతో రిస్క్ చేసి ఈ సన్నివేశాన్ని పెట్టారు.
ఇప్పుడు ఈ చిత్రానికి వస్తున్న ఆదరాభిమానాలన్నీ ఆయనకే చెందుతాయి అని చెప్పుకొచ్చింది.ఇటీవలె ఈ సినిమా విడుదలైన తెలిసింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన సీక్వెల్ పనులు కూడా మొదలయ్యాయట.ఇదే విషయాన్ని స్వయంగా కరణ్ జోహార్ తెలిపారు.
సీక్వెల్లో మరికొంతమంది కొత్తనటీనటులు ఉంటారని తెలిపారు.