శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి కొండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి , ఎక్కడికక్కడ కాలువలు అన్ని జలమయమయ్యాయి వాగులు వంకలు వరద ఉద్ధృతతో పొంగిపొర్లుతున్నాయి, వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో అటుగా వెళ్ళిపోతున్న బైకులు అన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది, కొట్టుకుపోతున్న బైక్లను బైక్ లపై ఉన్న వారిని స్థానికులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.స్థానికులంతా కలిసి ఒక చైన్ ల ఏర్పడి అక్కడ వరదలకు కొట్టుకుపోతున్న బైక్ ల పైన ఉన్న ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
కర్ణాటక జై మంగలి నది నుంచి వస్తున్న వరద ఉధృతతో పెన్నా నది ప్రవాహం పెరిగింది దానికి కారణంగానే వరద తీవ్ర రూపం దాల్చింది.మరి కాసేపు లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టనున్నారు.