అల్యూమినియం, స్టీల్, ఫైబర్ గ్లాస్, కలప వంటి పదార్థాలతో బోట్స్ తయారు చేయడం మనం వింటుంటాం.ఫైబర్ గ్లాస్ అంటే నిజంగా గాజు అని కాదు ఇది జస్ట్ ప్లాస్టిక్ లాగా కనిపించే ఒక మెటీరియల్.
అయితే తాజాగా ఇవన్నీ పదార్థాలతో కాకుండా ఒక స్పష్టమైన గ్లాస్ తో బోట్ ని తయారు చేశారు.పారదర్శకంగా ఉన్న ఈ గ్లాస్ చాలా గట్టిది అని తెలుస్తోంది.
అందుకే ఈ బోట్‌పై కొందరు ప్రయాణం చేస్తూ ఆశ్చర్యపరిచారు.ఈ అద్భుతమైన ప్రయాణం మెక్సికోలో సాగింది.
దీనికి సంబంధించిన వీడియోని ఎర్త్ ఫిక్స్ అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.దీనికి లక్షల్లో లైకులు, వ్యూస్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక అద్దం లాంటి బోట్ నీళ్లలో ప్రయాణించడం చూడవచ్చు.దీనిలో ఐదారుగురు ఎక్కారు.ఆ తర్వాత వారు తమ కింద ఉన్న నీటిని చూడగలిగారు.అంటే బోటు కింద ఉన్న నీటిని కూడా చూడగలరు.
ఎందుకంటే అది ఒక అద్దంగా ఉంది.దాంతో చూసేందుకు నీటిపైన తేలుతూ వెళ్తున్న భ్రాంతి కలిగింది.
కొందరు ఈ బోట్ కిందకి వెళ్లి విన్యాసాలు చేశారు.వారు బొడ్డు కింద నీటిలో తేలియాడుతూ కనిపించారు.
ఈ దృశ్యాలను బోట్‌లో ఉన్న ఒక వ్యక్తి వీడియో తీశాడు.ఈ దృశ్యాలు మంత్రముగ్ధుల్ని చేసేలా ఉన్నాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.“ఈ అనుభూతి మామూలుగా లేదు.ఇలాంటి బోట్‌లో ప్రయాణించాలని, మాకు ఉంది” అని కామెంట్లు పెడుతున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.