ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బాలయ్య హ్యాట్రిక్ రికార్డ్!

ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో ఫుల్ ఫామ్ తో ఆకట్టు కుంటున్న హీరో ఎవరు అంటే బాలయ్య అనే చెప్పాలి.ఈ మధ్య కాలంలో నందమూరి నటసింహం బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) ఏ సినిమా చేసిన తిరుగులేని విజయం సాధిస్తుంది.

 Hat-trick Balayya With Bhagavant Kesari In Rtc X Roads, Hat-trick Balayya, Bhaga-TeluguStop.com

ఏ డైరెక్టర్ అయినా ఈయనకు పెర్ఫెక్ట్ కథను అందిస్తుండడంతో బాలయ్యకు తిరుగులేని విజయం అందుతుంది.

మరి తాజాగా బాలకృష్ణ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.దసరా సీజన్ లో బరిలోకి దిగిన సినిమాల్లో ”భగవంత్ కేసరి” ( Bhagavanth Kesari ) ఒకటి.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి”.

ఈ సినిమా కూడా బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది.</br

అక్టోబర్ 19న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అయ్యిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తర్వాత వచ్చిన ఈ సినిమా మరో రికార్డ్ నెలకొల్పింది.ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భగవంత్ కేసరి మూవీ రికార్డును నెలకొల్పినట్టు తెలుస్తుంది.

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 1 కోటి గ్రాస్ వసూళ్లు చేయగా ఇప్పుడు భగవంత్ కేసరి కూడా ఈ లిస్టులోనే చేరింది.దీంతో హ్యాట్రిక్ 1 కోటి గ్రాసింగ్ సినిమాలు ఉన్న హీరోగా బాలయ్య రికార్డ్ నెలకొల్పాడు.

ఇదిలా ఉండగా బాలకృష్ణ ఇప్పుడు మరో కొత్త సినిమాను బాబీ దర్శకత్వంలో స్టార్ట్ చేసి స్పీడ్ గా ఫినిష్ కూడా చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube