తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రచారాన్ని వేగవంతం చేసింది.ఇందులో భాగంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
ఈ మేరకు బోధన్, ఆదిలాబాద్ తో పాటు వేములవాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు.ముందుగా మధ్యాహ్నం బోధన్ కు రానున్న రాహుల్ గాంధీ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
తరువాత మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు.అనంతరం సాయంత్రం 4 గంటలకు వేములవాడ నియోజకవర్గానికి వెళ్లనున్నారు.
మరోవైపు పలు నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించనున్నారు.







